Casting Couch: చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన సింగర్ చిన్మయి..
Casting-Couch
ఎంటర్‌టైన్‌మెంట్

Casting Couch: మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన సింగర్ చిన్మయి శ్రీపద.. ఎందుకంటే?

Casting Couch: టాలీవుడ్ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’ (లైంగిక వేధింపులు) లేదని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా ఖండించారు. తాజాగా దీనికి సంబంధించి తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తెలుగు పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి లేదని అన్నారు. ‘పరిశ్రమ అనేది ఒక అద్దం లాంటిది, అది మీరు ఎలా ఉన్నారో అలాగే ప్రతిబింబిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. అంటే, వ్యక్తుల ప్రవర్తనను బట్టే వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయని, అది వ్యక్తిగత విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

Read also-Mrunal Siddhant: మృణాల్ ఠాకూర్ కొత్త బాయ్ ప్రెండ్ ఎవరో తెలుసా?.. పాపం ధనుష్ పరిస్థితి!

ఈ విషయానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది పరిశ్రమలో ఇంకా కొనసాగుతున్న తీవ్రమైన సమస్య అని, దీనివల్ల ఎంతోమంది మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా.. ‘పరిశ్రమ అద్దం లాంటిది’ అన్న వ్యాఖ్యను ఆమె తప్పుబట్టారు. విదేశాల నుండి లేదా మంచి విద్యావంతులైన అమ్మాయిలు ఎంతో ఆశతో పరిశ్రమలోకి వస్తున్నారని, వారు తప్పుగా ప్రవర్తించడం వల్ల వేధింపులు జరగడం లేదని ఆమె వాదించారు. తన సొంత అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, రచయిత వైరముత్తు తనను వేధించినప్పుడు తన తల్లి కూడా అక్కడే ఉందని, అయినా అతను ఆగలేదని చెప్పారు. పని ఇచ్చే బదులు లైంగిక కోరికలు తీర్చాలని కోరుకునే పురుషుల మనస్తత్వమే అసలు సమస్య అని ఆమె స్పష్టం చేశారు.

Read also-Chiranjeevi: పద్మశ్రీ విజేతలు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లకు చిరు సన్మానం

సినిమా పరిశ్రమలో ‘కమిట్‌మెంట్’ అనే పదానికి అర్థం మార్చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న వారు దీనిని ‘వృత్తి నైపుణ్యం’ అని భావిస్తే, కొందరు పురుషులు మాత్రం దీనిని ‘లైంగిక సహకారం’గా పరిగణిస్తున్నారని విమర్శించారు. చిరంజీవి గారి తరం వారు తమ తోటి నటీమణులను గౌరవించేవారని, కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. చిరంజీవి బాధితులనే తప్పుబట్టేలా (victim-blaming) మాట్లాడటంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. శివాజీ విషయం మరవక ముందే మెగాస్టార్ మరో వివాదంలో చిక్కుకోవడం, టాలీవుడ్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ టాపిక్ ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి మరి.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?