Floating Restaurant: రాష్ట్ర పర్యాటకశాఖ పర్యాటకుల కోసం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. జలంపై జల్సా చేయడానికి, పర్యటకుల అభిరుచులకు అనుగుణంగా ప్లోటింగ్ రెస్టారెంట్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇది సక్సెస్ అయితే మరికొన్ని ప్రాంతాల్లో ఈ రెస్టారెంట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్రం సహకారంతో ఈ రెస్టారెంట్ ప్రారంభం కాబోతుంది.
రామప్ప సరస్సుల్లో ఏర్పాటు..
తెలంగాణలో తొలిసారి ప్లోటింగ్ రెస్టారెంట్ రాబోతుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ ఈ రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఇందులో చిన్నపాటి ఫంక్షన్, డిన్నర్, బర్త్ డే ఫంక్షన్ చేసుకోవచ్చు. అంతేకాదు బార్లు సైతం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ తొలి ప్లోటింగ్ రెస్టారెంట్ ను జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లా రామప్ప సరస్సుల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కేంద్రం ప్రభుత్వం 3కోట్ల రూపాయలను కేటాయించింది. కేంద్రం అనుమతితో టెండర్లు సైతం కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఈ రెస్టారెంట్ తో భక్తులను ఆకట్టుకోవడంతో పాటు ప్రభుత్వానికి సైతం ఆదాయం వస్తుంది. దీంతో పాటు సోమశీలకు సైతం ఒక బోటు(పడవ) మంజూరైంది. దీనికి సైతం కేంద్ర ప్రభుత్వం 2.2కోట్లు మంజూరుచేసింది. అదే విధంగా భద్రాద్రిలో సైతం ఒకబోటు కు అనుమతి వచ్చింది. దానిని సైతం 2కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఇది దుమ్ముగూడెం-పర్ణశాల మీదుగా భద్రాచలం చేరుకోనుంది. వీటికి సైతం టెండర్లు కంప్లీట్ అయినట్లు తెలిసింది.
త్వరలోనే హుస్సేన్ సాగర్, దుర్గంచెరువు
హైదరాబాద్ ప్రజలు వీకెండ్ లో ఇతర ప్రాంతాలకు అహ్లాదం కోసం వెళ్తుంటారు. రెండు రోజులు టూర్లకు వెళ్తున్నారు. అయితే వారి ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని ప్లోటింగ్ రెస్టారెంట్లను హుస్సేన్ సాగర్, దుర్గం చెరువులో ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. అందుకోసం ప్రణాళికలను టూరిజం అధికారులు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరగనుంది. టూరిజంశాఖకు ఆదాయం సైతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Marri Venkata Reddy: కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డికి.. రిపబ్లిక్ డే రోజున దక్కిన అరుదైన గౌరవం..?
27 ప్రాంతాల్లో 99బోట్లు
తెలంగాణలో ప్రస్తుతం 27 ప్రాంతాల్లో 99బోట్లు నడుస్తున్నాయి. క్రూయిజ్ బోట్లు 6, అమెరికన్ పాన్ టూన్ బోట్లు 4, మైకనైజ్డ్ బోట్లు 5, పాటూన్ బోట్లు19, డీలక్స్ బూట్లు 9, స్పీడ్ బూట్లు 35, పెడల్ బూట్లు 21 ఉన్నాయి. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మిరాలం చెరువు, సరూర్ నగర్ చెరువు, మిర్యాలగూడ పందిళ్లపల్లి, నాగార్జునసాగర్, సూర్యాపేటలోనిసద్దుల చెరువు, భువనగిరిలోని రాయిగిరి చెరువు, ఖమ్మంలో లకారం చెరువు, మదిర, కొత్తగూడెంలోని కిన్నెరసాని, ములుగులోని లక్నవరం చెరువు, కరీంనగర్ లోని ఎల్ఎండీ కరీంనగర్, జగిత్యాలలోని కోటిలింగాల, సిద్దిపేటలోని కోమటిచెరువు, జయశంకర్ భూపాలపల్లిలోని రామప్పసరస్సు, నిజామాబాద్ లోని అలీసాగర్, నిర్మల్ లోని కడెం ప్రాజెక్టు, గద్వాలలోనిజమ్ములమ్మ, మహబూబ్ నగర్ లోని కోయిల్ సాగర్, నాగర్ కర్నూల్ లోని ఈగలపెంట, కేసారిసముద్రం, సింగోతమ్, సోమశీల, జొన్నలబొగడ(బ్యాలెన్సింగ్ రివర్), వికారాబాద్ లోని లక్నపూర్ లేక్, సిరిసిల్లలోని వార్దవల్లి(బ్యాక్ వాటర్ ఆప్ ఎంఎండీ). అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.
13.06కోట్ల ఆదాయం
పర్యాటశాఖ తీసుకుంటున్న చర్యలతో బోటింగ్లతోప్రభుత్వానికి స్వదేశీ, విదేశీ పర్యటకుల సంఖ్య పెరుగుతుంది. వీకెండ్ లో ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. గతేడాది (2025)లో జనవరి నుంచి నవంబర్ వరకు బోటింగులతో 13.06కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో 4.96కోట్ల లాభం వచ్చింది. అయితే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధితో వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టిసారిస్తుండటంతో ఇంకా పెరిగే అవకాశం ఉన్నది.
మరో 8 ప్రాంతాల్లో బోట్ల డిమాండ్
రాష్ట్రంలోని మరో 8 ప్రాంతాల్లో బూట్లకు డిమాండ్ ఉంది. నదిజలాల్లో విహరించేందుకు పర్యాటకులశాఖ పెరగడంతో అందుకు అనుగుణంగా బోట్లు లేవు. దీంతో అధికారులు 8 ప్రాంతాలు పరిగి,జొన్నలబొగూడ, వార్దవెల్లి, రాయిగిరి, పర్ణశాల, భద్రాచలం, బోరంచ, నిజాంసాగర్ లో ప్రస్తుతం అత్యవసరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 9 బోట్ల ఏర్పాటుకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం నుంచి ప్లోటింగ్ రెస్టారెంట్ తో పాటు రెండుబోట్లకు అంగీకారం తెలిపింది. ఏది ఏకమైనప్పటికీ పర్యాటశాఖ తీసుకుంటున్న చర్యలతో టూరిజంకు నూతనశకం ప్రారంభమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Chevella News: చేవెళ్ల మండల పరిధిలో.. అధికారుల నిర్లక్ష్యానికి జాతీయ జెండాకు అవమానం..!

