Minister Komati Reddy: నల్గొండను అభివృద్ధి చేసింది చేసేది నేనే నని రాష్ట్ర రోడ్డు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) అన్నారు. ఆదివారం నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ శాంతినగర్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుతూ తన అనుచరులతో కలిసి పట్టణంలోని ఇతర ప్రాంతాలతో పాటు పద్మావతి, అమూల్య కాలనీలో విస్తృతంగా పర్యటించి అందర్నీ పలకరించుకుంటూ ప్రచారం కొనసాగించారు. నల్గొండ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 48 డివిజన్లు ఉండగా 6, 25, 41, 19వ డివిజన్ కార్పొరేషన్ల స్థానాలకు అభ్యర్థులుగా కర్నాటి సునంద కర్ణాకర్ రెడ్డి, జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, గోగుల గణేష్ లను ప్రకటించారు.
రూ. 2200 కోట్లతో డెవలప్ మెంట్..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నల్గొండను కంప్లీట్‌గా అభివృద్ధి చేసేందుకు మున్సిపాలిటీ హోదా నుంచి కార్పొరేషన్‌గా మార్చామని చెప్పారు. నల్గొండ టౌన్‌లో రూ. 2200 కోట్లతో డెవలప్ మెంట్ వర్క్స్ నడుస్తున్నాయని తెలిపారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్లగొండలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రథసప్తమిని పురస్కరించుకొని ప్రచారం చేపట్టినట్లు చెప్పారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నల్గొండ కార్పొరేషన్ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేసుకున్నామని తొలిసారిగా జరిగే మేయర్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 48 డివిజన్ లలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజల విశ్వసించటం లేదని కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని కోరారు.
Also Read: Mohan Babu: మోహన్ బాబుకు గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు

