Prudhvi | నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా వేధిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన కామెంట్లపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాయ్ కాట్ లాల్ హ్యాష్ ట్యాగ్ లతో హోరెత్తిస్తోంది.
అలాగే నటుడు పృథ్వీ తనకు వైసీపీ సోషల్ మీడియా నుంచి ఫోన్లు, మెసేజ్ లతో వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న హై బీపీతో ఆయన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనను వేధించడం వల్లే హైబీపీ పెరిగిందంటూ ఆయన పేర్కొన్నారు.