Ka Paul | ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన కామెంట్లు చేశాడు. అల్లు అర్జున్ ను జైల్లో పెట్టించిందే ఎన్డీయే ప్రభుత్వం, పవన్ కల్యాణ్ అని కామెంట్ చేశాడు. తాజాగా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఈ నడుమ ప్రతి విషయంపై ఆయన ఏదో ఒక రకమైన కామెంట్ తో వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ రూపాంతంరం చెంది జనసేనగా మారింది అంటూ కామెంట్ చేశారు.
దానిపై తాజాగా కేఏపాల్ మాట్లాడుతూ ‘ప్రజారాజ్యం పార్టీ వెళ్లి కాంగ్రెస్ లో కలిసినట్టు జనసేన కూడా బీజేపీలో కలుస్తుంది. కాకపోతే దానికి పవన్ కల్యాణ్ ఒప్పుకోవట్లేదు. అందుకే బీజేపీ కేంద్రంలో చిరంజీవికి కీలక పదవి ఇవ్వాలని చూస్తోంది. త్వరలోనే అన్ని విషయాలు బయటపడుతాయి. మెగా ఫ్యామిలీని బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్లు అరవింద్ ను కూడా బీజేపీలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ అతను రాకపోవడంతో అల్లు అర్జున్ ను జైల్లో పెట్టించారు’ అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.