Nampally Fire Accident: హైదరాబాద్‌లో (Hyderabad) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బచాస్ ఫర్నిచర్ క్యసిల్ అనే ఫర్నీచర్ షాప్ గోదాంలో మంటలు (Nampally Fire Accident) చెలరేగాయి. ప్రమాదవశాత్తూ చెలరేగిన ఈ మంటల ధాటికి చూస్తుండగా దుకాణం తగలబడిపోయింది. నాలుగు అంతస్తుల ఆ భవనంలోని కింద ఫ్లోర్‌లో మంటల చెలరేగడంతో పైఅంతస్తులలో పలువురు చిక్కుకున్నట్టుగా రెస్క్యూ టీమ్‌లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురు వరకు చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో తన కొడుకు ఇంతియాజ్ చిక్కుకున్నాడంటూ ఓ మహిళ దుకాణం ముందు రోదిస్తోంది. తన కొడుకు పదిపన్నెండేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నాడు, లోపల చిక్కుకున్నాడని విలపిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాదానికి గురైన బిల్డింగ్‌లో 3 ఫ్యామిలీలు పనిచేస్తున్నట్టు ప్రాథమిక సమాచారంలో తెలిసింది. సెల్లార్‌లో వాచ్‌మెన్ కుటుంబంలోని పిల్లలు ఇద్దరు, మరో కుటుంబానికి చెందిన నలుగురు చిక్కుకున్నట్టు సమాచారం. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
Read Also- VD14 Movie: విజయ్ దేవరకొండ ‘VD14’ టైటిల్‌తో రెడీ అయ్యాడు.. ఎప్పుడంటే?
రెస్క్యూ ఆపరేషన్‌కి చాలా టైమ్
అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవహించడంతో పాటు తీవ్రమైన అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందికరంగా మారింది. దీంతో, రెస్క్యూ ఆపరేషన్‌కు చాలా సమయం పడుతోంది. చిక్కుకున్నవారి క్షేమంపై ఇంకా అన్వేషణ కొనసాగుతోంది. ఎట్టకేలకు 10 ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశాయి. సహాయక చర్యల కోసం భారీ క్రేన్లను కూడా మోహరించారు. ప్రమాదంలో చిక్కుకున్నవారి కోసం తీవ్రంగా రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, ఘటనా స్థలాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో పాటు ఫైర్ డిపార్ట్‌మెంట్ డీజీ పరిశీలించారు. ఫర్నిచర్ డంప్‌లు అగ్నికి ఆహుతి కావడంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా ఉందని సీపీ సజ్జనార్ వివరించారు.
Read Also- Laddu Adulterated Ghee: ఛార్జిషీట్‌ను ఆయుధంగా మలుచుకున్న వైసీపీ.. చంద్రబాబు, పవన్ ఇరుకునపడినట్టేనా?
సజ్జనార్ కీలక సూచన
అగ్నిప్రమాదం నేపథ్యంలో నుమాయిష్ సందర్శనకు వెళ్లేవారికి హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) కీలక సూచన చేశారు. నాంపల్లిలోని ఒక ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగిందని, ఈ కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ తీవ్రంగా స్థంభించిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ ఒక్క రోజు నుమాయిష్ సందర్శనను వాయిదా వేసుకోవాలని సందర్శకులను ఆయన కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

