Minister Seethakka: ఉక్కు మహిళా ఇందిరా గాంధీ స్పూర్తితో మహిళలు సంతోషంగా ఉండాలి
ప్రజాపాలన ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది: మేడారంలో మంత్రి సీతక్క
ములుగు, స్వేచ్ఛ: ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. అయితే, ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న వాళ్లు ఫ్రీ బస్ మీద కుట్ర పన్ని అనేక కథనాలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది వనితలను మహిళా సంఘాల్లో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇప్పుడు 68 లక్షలు అయ్యారని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
Read Also- TG Power Sector: విద్యుత్ శాఖ బదిలీలపై నిరసనల సెగ.. దీని వెనుక మర్మమేంటి..?
రూ.1800 కోట్లు వాడుకున్నారు..
గత ప్రభుత్వం పావాల వడ్డీ అని , వైఎస్ఆర్ అభయ హస్తం కింద ఉన్న రూ.1,800 కోట్లు వాడుకున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. రెండు సంవత్సరాలుగా రూ.40 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చామని ఆమె ప్రస్తావించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లు ,మహిళా షాపులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లులు, ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకే ఇస్తున్నామన్నారు. ‘‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం. ఇల్లు కట్టుకునే వారికి మహిళా సంఘాల నుంచి ముందస్తుగా లక్ష రూపాయలు అందిస్తున్నాం. మహిళా సంఘం సభ్యులు ఏదైనా ప్రమాదంతో చనిపోతే 10 లక్షల అందిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా 410 మంది చనిపోతే.. మేనమామగా అండగా ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.41 కోట్లు అందించారు. వాళ్లు తీసుకున్న లోన్ భీమా పెట్టాం. 60 ఏళ్లు దాటిన వారిని కూడా మహిళా సంఘంలో ఉంచుతున్నాం. రూ.1,200 కోట్లు ఇటీవల వడ్డీ డబ్బులు జమ అవుతాయి. మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. కేసముద్రం మహిళ సంఘాలకు 2 బస్సులు ఇస్తున్నాం. వేం నరేందర్ రెడ్డి సహకారంతో కేసముద్రం మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతోంది’’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Read Also- Medaram Jatara 2026: మేడారం జాతర స్పెషల్.. 4,000 ఆర్టీసీ బస్సులు.. మంత్రి పొన్నం ప్రకటన
ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా సీతక్క మాట్లాడారు. ‘‘మీ ఇంటి ఆడబిడ్డ చెప్తోంది పోన్ ట్యాపింగ్ చేశారని. మేము 3 నెలల కాలంలోనే చితశుద్ధితో మేడారం ఆలయాలు అభివృద్ధి చేశాం. ఆడబిడ్డలకు ఎదగనివ్వాలి. ప్రజా పాలన ప్రభుత్వానికి అండగా ఉండండి వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండని కోరారు’’ అని మంత్రి సీతక్క కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో మేడారంలో శనివారం తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడారు.

