Naini Coal Block: ఉల్టా చోర్ కొత్వాల్‌లా నమస్తే తెలంగాణ వార్తలు?
– తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నం?
– కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పటి టెండర్లపై కూడా పునరాలోచించేలా లేఖ
– 2017లో ఎస్‌వీఈసీ కంపెనీకి టెండర్ కంటే 35 శాతం ఎక్కువగా ఇచ్చిన వైనం?
– 2021లో దుర్గ ఇన్ఫ్రాకు 16 శాతం ఇచ్చింది హరీశ్ బామ్మర్దే?
– ఇలా రూ.10 వేల కోట్ల టెండర్లలో కోట్ కంటే ఎక్కువగానే బిడ్
– నైనీ 25 ఏండ్ల ప్రాజెక్ట్ కావడంతో రాజకీయ రంగు పులుముతున్న ప్రయత్నం
– ఇదే అదునుగా లేఖలతో హరీశ్ రావు హడావుడి
– ఇదంతా బామ్మర్ది అక్రమాలను కాపాడేందుకా.. ఇరికించేందుకా?
– ఇప్పటి సీఎం బామ్మర్ది అంటూ ఇంటి పేపర్‌లో వరుస వార్తలు
– సింగరేణి మైనింగ్‌పై దర్యాప్తు చేస్తే ఇబ్బందులు ఎవరికి?
– హరీశ్ ‘ట్రబుల్’ గేమ్‌పై పొలిటికల్ ఆసక్తి
స్వేచ్ఛ: సింగరేణిలో నైనీ టెండర్స్ రాద్దాంతం తారస్థాయికి చేరింది. మూడు రోజుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishna Reddy)కి మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) రెండు లేఖలు రాయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. అటు ఫోన్ ట్యాపింగ్‌లో నిత్యం కేటీఆర్(KR), హరీశ్ రావు(Harish rao) ఒకరికొకరు తోడుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ, అంతర్గతంగా కాంగ్రెస్ మంత్రుల కంటే లోలోపల కుమ్ములాటలు, కుట్రలు అలాగే దాగి ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. సాధారణంగా ఇంటి పార్టీల్లో పోటీ ఉన్నప్పుడు బయటకు వచ్చేంత వరకు ఏదీ పొక్కదు. కానీ, నేషనల్ పార్టీలో జరిగే చిన్న చిన్న గ్యాప్‌లను కూడా ఎక్కడా లేనట్లు చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో దాన్నే ఒక భూతంలా చూపిస్తున్నారు. నిజానికి అసలు కుట్రలు ఏంటో బయటకు పొక్కకుండా జరుతున్న తీరుపై ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ స్టోరీ.
గత 20 ఏండ్లలో టెండర్స్ జరిగిన తీరు ఇదే..
బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క టెండర్ చూసినా కోట్ చేసిన దానికి మైనస్‌లోకి వెళ్లలేదు. యావరేజ్‌గా తీసుకున్న 5 శాతం తగ్గలేదు. కానీ, ఇప్పుడు నైనీ టెండర్ రద్దు చేసినా ఇంకా బామ్మర్ది టెండర్ రద్దు ఎప్పుడు అంటూ చెప్పుకొస్తున్న హరీశ్ రావు కథల వెనుక చాలా కుట్రలు దాగి ఉన్నాయి. పదేళ్ల పాలనలో ఆఖరి 6 నెలలు తప్ప మిగిలన రోజుల్లో మైనింగ్ శాఖ కేటీఆర్ కనుసన్నల్లోనే ఉన్నది. ఆ సమయంలో 20 వరకు టెండర్స్ జరిగాయి. వాటిని తీక్షణంగా పరిశీలిస్తే, చాలా లొసుగులు ఉన్నాయి. అప్పుడు ఈ షోకాల్డ్ మాజీ మంత్రికి డీజిల్‌పై జీఎస్టీ గుర్తుకు రాలేదు. ఇప్పుడు గుర్తించినా ఇన్ పుట్ సబ్సిడీ తెలియదా? రేట్లు అంటూ పాట్లు అంటూ లేఖలు రాస్తున్నారు. అసలు ఎంతో కొంత సమాచారం ఉండాల్సింది ఆ శాఖ నిర్వర్తించిన కేటీఆర్‌కే కానీ హరీశ్ రావు లేఖల వెనుక ఉద్దేశం అర్థం అవుతున్నది. మీడియాను గుప్పిట్లో పెట్టుకుని అసలు కుట్రలు బయటకు రానివ్వడం లేదని తెలుస్తున్నది.
కేటీఆర్ నిర్వహించిన శాఖపై హరీశ్‌కు అంత ఇంట్రెస్ట్ ఎందుకు?
బీఆర్ఎస్‌లో కూడా ఎంక్వైరీలు ఎన్నో జరిగాయి కానీ, రిపోర్టులు బయటకు రాలేదు. ఎన్నో సార్లు టెక్నికల్ కారణాలు చూపించి, 5 నుంచి 7 సార్లు పోస్ట్ పోన్ చేసిన సంఘటనలు ఉన్నాయి. సోలార్ పవర్ స్కాంలో అర్హులను కాదు క్లబ్పింగ్ స్టాండర్డ్ ప్రాక్టీస్ సమస్య ఉన్నది. దీని చుట్టూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కథలు నడిచాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. హరీశ్ రావు వీటిని దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ గతంలో నిర్వహించిన శాఖపై మొత్తం దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారా అనే చర్చ జరుగుతున్నది.
అలూ లేదు చూలు లేదు.. ప్రకాశంపై ఆరోపణలు నిధుల కోసమే?
ఏదైనా పెద్ద టెండర్స్‌లో హైలైట్ అయితే డబ్బులు ముడుతాయి. అందులోనూ మైనింగ్ కేసు. నైనీ అనేది 25 ఏండ్లు, రూ.25 వేల కోట్ల ప్రాజెక్ట్. టెండర్స్‌లో ఏటా 10 శాతం లాభం ఉన్నా, రూ.100 నుంచి రూ.150 కోట్లు వస్తాయి. ఇది దక్కించుకునే వారిని టార్గెట్ చేస్తే ఒకేసారి వందల కోట్లు వచ్చి పడుతాయని హరీశ్ రావు ఆర్థిక ప్లానింగ్. అదేమీ తెలియనట్లు రాబోయే టెండర్ గురించి రూ.వెయ్యి కోట్లు అంటూ బిడ్డర్లను బెదిరిస్తున్నారు. ఫిబ్రవరి 2న డెడ్ లైన్ ఉన్నది. కానీ, కేసీఆర్ హ్యాండోవర్‌లో నడిచే పత్రికలో బామ్మర్ది కోసం అంటూ రాసిన వార్తలు, ప్రకాశం టెండర్స్ అంటూ రాసిన కథనాలను చూస్తుంటే నమస్తే తెలంగాణ మొత్తం కేటీఆర్ నుంచి హరీశ్ రావు చేతిలోకి వెళ్లినట్లు కనిపిస్తున్నది. కుట్రలు గమనించకపోతే మొత్తానికే కేటీఆర్‌ను నిండా ముంచేయడం ఖాయం.
ఫోన్ ట్యాపింగ్‌లో అంతేనా?
హరీశ్ రావు, శ్రవణ్ రావుల పాత్రపై పోలీస్ అధికారులకు ఓ క్లారిటీ ఉన్నది. కేసీఆర్‌కు ప్రభాకర్ రావుకు ఓ లెక్క ఉన్నది. మధ్యలో ఓ పేపర్ ఓనర్, ఛానల్ ఓనర్‌తో పాటు కీలక నేతలతో బాండ్స్ వ్యవహారం నడిపించారు. అదంతా పోలీసులకు తెలుసు కానీ నన్నే పిలిచారు, అందరినీ పిలువాలనే రాజకీయ కుట్రలతో జరిగిన పరిణామాలకు నిదర్శనంగా హరీశ్ రావు మాటలు ఉన్నాయి. ట్యాపింగ్ చేసిన వారిలో కేటీఆర్ పేరు ఎక్కడా లేదని మొదట్లో అన్నారు. సాక్షిగా పిలిచి అయినా మరకలు ఉండాల్సిందే అని పట్టుబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతి పక్షంలోని పార్టీలో ఏది కుటుంబ కుట్రనో కూడా గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొన్నది. సొంత చెల్లి బయటకు వచ్చి చెబితే కానీ తెలియని పరిస్థితి కేటీఆర్‌కు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: Municipal Politics: మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు క్యూ కట్టిన కాంగ్రెస్ నేతలు.. ఎందుకో తెలుసా ..!

