Graveyard Encroachment: అక్రమార్కులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న అధికారులు
సమాధులను కబ్జాలు చేసి క్రయ విక్రయాలు
హైదరాబాద్ పరిధిలో వెలుగులోకి దారుణాలు
పట్టించుకోని అధికారులపై స్థానికుల మండిపాటు
చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
రాజేంద్రనగర్/స్వేచ్ఛ: అక్రమాలు చేయడానికి కాదేదీ అనర్హం.. కంటికి కనిపించిన ప్రతీది మనదే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు అక్రమార్కులు.. కంటికి కనిపించిన ప్రతి ఖాళీ స్థలాన్ని కబ్జా చేసుకుంటూ పోతున్నారు.. వీరి పైశాచికత్వం ఏకంగా సమాధులకు తాకింది.. దీంతో సమాధిలో సుఖంగా నిద్రిస్తున్న వారికి (Graveyard Encroachment) కూడా వీరి అక్రమాలతో శాంతి లేకుండాపోయింది… మణికొండలో పరిస్థితి ఇలా మారింది. నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ సర్వేనెంబర్ 261 లో 2006 అప్పటి ప్రభుత్వం అధికారికంగా 60 గజాల చొప్పున నిరుపేద ప్రజలకు 278 పట్టాలను మంజూరు చేశారు. అక్కడ పేదలు నిర్మాణాలు చేసుకోగా ఖాళీ స్థలంపై కొందరు కబ్జా దారులు కన్ను వేసి 500 పైగా నిర్మాణాలు చేస్తుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు.
Read Also- Corrupted Officer: 27 ఎకరాల భూమి.. చెప్పలేనన్ని ఆస్తులు.. రంగారెడ్డిలో భారీ అవినీతి తిమింగలం!
ఇంత జరుగుతున్నా అధికారులకు కనీసం పట్టడం లేదు. దీంతో ప్రజల నుంచి సైతం తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కొంతమంది నాయకులు కుమ్మక్కై అంతా వారే ఉంటూ ఫేక్ పట్టాలను సృష్టించి ఇష్టం వచ్చినట్లు అమ్మకాలు చేస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మణికొండ మున్సిపల్ అంటేనే కోట్లలో వ్యాపారం ఇదే అదునుగా చూసుకొని కబ్జాదారులు ఇష్టం వచ్చినట్టు దొంగ పటాలను సృష్టించి నిర్మాణాలు చేస్తున్నారనే వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమార్కులు ఒక ముఠాగా ఏర్పడి ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నట్లు ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఈనాడు రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉంది, ఏముంది, ఎంతుంది అనేది స్పష్టమైన మార్కింగ్ చేయడం లేదని స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్లనే అక్రమార్కులు రెచ్చిపోయి దొంగ పట్టాలను సృష్టించి విక్రయాలు జరుపుతున్నారు. దీంతో అక్రమార్కులు కోట్లను కొల్లగొడుతున్నారు.
సమాధులపై పునాదులు…
మణికొండలో అక్రమార్కుల నిర్వాకంతో సమాధులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. సమాధులను తొలగించి పునాదులు లేపి అక్కడ నిర్మాణాలను చేపట్టి అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. చనిపోతే గుర్తుగా సమాధులు ఉంటాయని, ఆ గుర్తులు కూడా చెరిపేసి దొంగ పట్టాలు సృష్టించి అమ్మకాలు జరుపుతున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మణికొండలో జోరుగా ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంటే అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా అసలే గజం స్థలం లక్షకు పైగా ఉండడంతో అక్రమార్కులు తమ ధన దాహానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ప్రజలు మండిపడుతున్నారు. చస్తే సమాధులపై బేరం చేస్తున్న వైనం మణికొండలో చోటు చేసుకోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Also- Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లలో కలెక్టర్, ఎస్పీ ఫుల్ బిజీ.. ఎక్కడికక్కడ తనిఖీలు

