Corrupted Officer: అక్రమాస్తులతో పట్టుబడ్డ జాయింట్ సబ్ రిజిస్ట్రార్
ఆయన సంపద 100 కోట్లకు పైనే
పై అక్రమాస్తుల కేసు నమోదు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: అవినీతి అధికారుల వలకు మరో అవినీతి తిమింగలం దొరికింది. భారీ అవినీతి బాగోతం బయటపడింది. ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో సదరు అధికారి రూ.7.83 కోట్ల విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్నట్టుగా వెల్లడైంది. అయితే, ప్రైవేట్ మార్కెట్‌లో వీటి విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని అంచనాగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1గా ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం సస్పెన్షన్‌లో (Corrupted Officer) ఉన్నాడు. కాగా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా అందిన సమాచారం అందింది. దీంతో ఏసీబీ అధికారులు శుక్రవారం వేర్వేరు బృందాలుగా విడిపోయి అతడి నివాసంతోపాటు బంధుమిత్రుల ఇండ్లపై దాడులు జరిపారు.
Read Also- Bandi Sanjay On KTR: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై మరోసారి బండి సంజయ్ ఆరోపణలు
సోదాలు చేయగా కాప్రా ప్రాంతంలోని భవానీనగర్‌లో మధుసూదన్ రెడ్డికి 300 వందల చదరపు గజాల్లో ట్రిప్లెక్స్ ఇల్లు ఉన్నట్టుగా బయటపడింది. దాంతోపాటు ఇబ్రహీంపట్నం చింతపల్లిగూడలో ప్లాటు, పరిగి మండలం నస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఇబ్రహీంపట్నం మంగళ్ పల్లిలో ఒక ఎకరం కమర్షియల్ ల్యాండ్, 1.24 కోట్ల రూపాయల విలువ చేసే ఫార్మ్ హౌస్ (స్విమ్మింగ్ పూల్ తో కలిపి) ఉన్నట్టుగా గుర్తించారు. దాంతోపాటు మధుసూదన్ రెడ్డి ఇంటి నుంచి ఏసీబీ అధికారులు 9 లక్షల రూపాయల నగదు, 1.2 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా ఫార్చునర్, వొల్వో, వోక్స్ వ్యాగన్ కార్లు కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఇక, మధుసూదన్ రెడ్డి 80 లక్షల రూపాయలను ఏఆర్కే స్పిరిట్స్ పేర లిక్కర్ దందాలో పెట్టుబడులుగా పెట్టినట్టు విచారణలో వెల్లడైంది. సీజ్ చేసిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 7.83 కోట్ల రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్ లో ఇది వంద కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని పేర్కొన్నారు.

