KCR-BRS:
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు , ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి మాజీ సీఎం కేసీఆర్ (KCR-BRS) అండగా నిలిచారు. పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరించిన కుసుమ జగదీశ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. జగదీశ్ కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదవడానికి ప్రయత్నిస్తున్న విషయం గురించి పార్టీ నాయకుల ద్వారా కేసీఆర్ తెలుసుకున్నారు. ఆమె మెడిసిన్ చదవడానికి అవసరమైన ఫీజు చెక్కును శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో సుకీర్తికి అందజేశారు. బాగా చదువుకోవాలని సూచించారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సుకీర్తిని ఆశీర్వదించారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా చెక్క సమర్పించే సమయంలో అక్కడ ఉన్నారు.
Read Also- Raakaasaa Glimpse: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ వచ్చేశాయ్ చూశారా.. నిహారిక రెండో సినిమా
హరీష్ రావు,కేటీఆర్ కు నోటీసులు ప్రభుత్వానికే నష్టం
హిల్ట్ పాలసీతో దోపిడికి శ్రీకారం
కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు
ఏ విచారణ కి అయిన మేము సహకరిస్తాం
పదేళ్లలో మీలా మేము ఉంటే మీరు అధికారంలోకి వచ్చే వాళ్లా?
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: హరీష్ రావు, కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ప్రభుత్వానికే నష్టమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తన 35 ఏళ్ల జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని, రాష్ట్రంలో విచిత్రమైన ప్రభుత్వం ఉందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోని అవినీతి బయటికు తీస్తే ఎవరూ బయట ఉండే వాళ్లు కాదన్నారు. మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్టు చెబుతున్నారని, ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సయోధ్య లేదన్నారు. బొగ్గుకి సంబంధించిన ఆధారాలు హరీష్ రావు బయట పెట్టగానే సిట్ నోటీసులు ఇచ్చారన్నారు. ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ప్రభుత్వం దీర్ఘకాలికంగా ఉండదన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టైనా కట్టారా..? తాము చేసినవి ప్రారంభిస్తున్నారు తప్ప అని విమర్శించారు. పాలనను గాలికొదిలి ప్రతి పక్ష పార్టీ పై దృష్టి పెడితే మీరే నష్టపోతారన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ నాయకులకు సంబంధం ఉండదన్నారు. హిల్ట్ పాలసీతో భూదోపిడీకి శ్రీకారం చుట్టారన్నారు. ఏ విచారణకైనా సహకరిస్తామన్నారు.
పదేళ్లలో తాము ఇలా చేసి ఉంటే అధికారంలోకి వచ్చే వాళ్లా? అని తలసాని ప్రశ్నించారు. దావోస్ పర్యటన పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారని, కానీ, అవి రాబోవని అన్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే పరనింద ఆత్మ స్తుతిలా జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెట్ నుశికండి లాగా వాడుతున్నారన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కేసులు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకుల టార్గేట్ సెట్ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సునితాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలను సిట్ పేరుతో రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. పాలన చెయ్యలేక డైవర్శన్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేస్తోందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలో రేపు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు.

