RCB Ownership: ఐపీఎల్ (IPL) చరిత్రలో అత్యంత క్రేజ్ ఉన్న జట్టు ఏది అంటే టక్కున వినిపించే పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. దశాబ్ద కాలంగా కప్పు కోసం ఎదురుచూసినా, అభిమానుల ఆదరణలో ఈ జట్టు ఎప్పుడూ నెంబర్ వన్ స్థానంలోనే ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ కేవలం ఆట పరంగానే కాకుండా, యాజమాన్య మార్పు విషయంలోనూ వార్తల్లో నిలుస్తోంది.
Read also-Raakaasaa Glimpse: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ వచ్చేశాయ్ చూశారా.. నిహారిక రెండో సినిమా
అనుష్క శర్మ బిడ్?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ ఐకాన్ విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ ఈ ఫ్రాంచైజీలో వాటా దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు రూ. 400 కోట్ల పెట్టుబడితో 3% వాటాను ఆమె సొంతం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీకి ఈ జట్టుతో ఉన్న భావోద్వేగ బంధం దృష్ట్యా ఈ వార్తలకు బలం చేకూరుతోంది. అయితే, దీనిపై అనుష్క శర్మ వైపు నుంచి కానీ, ప్రస్తుత యాజమాన్యం నుంచి కానీ ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ప్రస్తుతానికి ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే.
రంగంలోకి దిగిన వ్యాక్సిన్ కింగ్
అనుష్క శర్మ వార్తలు ఇలా ఉండగా, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా మాత్రం బహిరంగంగానే తన ఆసక్తిని ప్రకటించారు. జనవరి 2026లో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఆర్సీబీ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడానికి రాబోయే నెలల్లో నేను బిడ్ వేయబోతున్నాను’ అని స్పష్టం చేశారు. 2025 సీజన్‌లో పురుషుల జట్టు అద్భుత ప్రదర్శన, మహిళల జట్టు (WPL) సాధించిన విజయాల తర్వాత ఆర్సీబీ బ్రాండ్ విలువ ఆకాశాన్ని తాకింది. అందుకే పూనావాలా వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు ఈ జట్టుపై కన్నేశారు.
Read also-Tarun Bhascker: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ చూశారా?.. ఎటకారాలు ఓకే ప్రతీకారాలే?
అమ్మకానికి అసలు కారణం ఏమిటి?
ప్రస్తుతం RCB యాజమాన్యాన్ని డయాజియో సంస్థ నిర్వహిస్తోంది. అయితే, ఈ సంస్థ తన వ్యాపార వ్యూహాలను మార్చుకుంటూ, స్పోర్ట్స్ ఫ్రాంచైజీల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీబీ మార్కెట్ విలువ దాదాపు రూ. 16,800 కోట్లు ఉంటుందని విశ్లేషకుల అంచనా. కేవలం పూనావాలా మాత్రమే కాకుండా, ‘హోంబలే ఫిల్మ్స్’ అధినేత విజయ్ కిరగందూర్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కూడా ఈ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 2026 నాటికి ఈ విక్రయ ప్రక్రియకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఆటగాడిగా కొనసాగుతున్న సమయంలోనే, ఆయన భార్య అనుష్క శర్మ కూడా మేనేజ్‌మెంట్‌లో భాగం పంచుకుంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ ఇది నిజమైతే, ఆర్సీబీకి ఇది కొత్త గ్లామర్ మరియు బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

