Sinners Oscars: అకాడమీ నామినేషన్లలో ‘సిన్నర్స్’ రికార్డ్..
Sinners-Oscars(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Sinners Oscars: ఆస్కార్ అవార్డు నామినేషన్లలో హిస్టరీ క్రియేట్ చేసిన ‘సిన్నర్స్’.. అన్ని కేటగిరీలా?

Sinners Oscars: ఆస్కార్ 98 ఏళ్ల చరిత్రలో ఏ సినిమా కూడా సాధించని విధంగా ‘సిన్నర్స్’ 16 నామినేషన్లను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు 14 నామినేషన్లతో రికార్డు సృష్టించిన ‘టైటానిక్’, ‘లా లా ల్యాండ్’, ‘ఆల్ ఎబౌట్ ఈవ్’ సినిమాల రికార్డును ఇది తుడిచిపెట్టేసింది.

Read also-Vijay Deverakonda: ‘వీడీ 15’ దర్శకుడికి విజయ్ దేవరకొండ అభిమాని ఎమోషనల్ నోట్..

నామినేషన్లు ఎందులోనంటే?

  • ఉత్తమ చిత్రం (Best Picture)
  • ఉత్తమ దర్శకుడు: రయాన్ కూగ్లర్
  • ఉత్తమ నటుడు: మైఖేల్ బి. జోర్డాన్ (జంట పాత్రలకు గాను)
  • ఉత్తమ సహాయ నటి: వున్మి మొసాకు
  • ఉత్తమ సహాయ నటుడు: డెల్రాయ్ లిండో
  • సాంకేతిక విభాగాలు: ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ & హెయిర్ స్టైలింగ్, ఒరిజినల్ స్కోర్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో నామినేషన్లు దక్కాయి.

సినిమా కథా నేపథ్యం: రయాన్ కూగ్లర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1930ల నాటి మిస్సిస్సిప్పీ నేపథ్యంలో సాగే ఒక పీరియడ్ డ్రామా సూపర్ నేచురల్ హారర్ (వ్యాంపయిర్) కథ. జాతి వివక్ష మరియు చారిత్రక అంశాలను భయంకరమైన ఫాంటసీతో ముడిపెట్టి తీసిన విధానం విమర్శకులను కూడా బాగా ఆకట్టుకుంది.

Read also-Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాపై ఇండస్ట్రీలో బిగ్ బజ్!.. హీరో ఎవరంటే?

పోటీలో ఉన్న ఇతర చిత్రాలు

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (One Battle After Another): లియోనార్డో డికాప్రియో నటించిన ఈ చిత్రం 13 నామినేషన్లతో రెండో స్థానంలో ఉంది. మాగీ గైలెన్‌హాల్ రూపొందించిన ‘ది బ్రైడ్!’ (The Bride!) ఇతర చిత్రాలు కూడా పోటీలో ఉన్నాయి. ఏటా లాగే ఈసారి కూడా కొందరు ప్రముఖులకు నామినేషన్లు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ‘గ్లాడియేటర్ II’ నటుడు పాల్ మెస్కల్, ‘వూల్ఫ్స్’ నటులు జార్జ్ క్లూనీ బ్రాడ్ పిట్ లకు నామినేషన్లు రాలేదు. ఈ 98వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుక మార్చి 15, 2026న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతుంది. ఈ వేడుకకు ప్రముఖ కామెడీ షో హోస్ట్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ‘సిన్నర్స్’, కేవలం ఒక హారర్ సినిమాగా మాత్రమే కాకుండా, అకాడమీని మెప్పించిన ఒక గొప్ప కళాఖండంగా నిలిచింది.

Just In

01

Graveyard Encroachment: స‌మాధులపై.. పునాదులు.. మ‌ణికొండ‌లో షాకింగ్ విషయం వెలుగులోకి!

Police Officers: హరీష్ రావు సారీ చెప్పాలి.. పోలీసుల అధికారుల సంఘం డిమాండ్.. ఎందుకంటే?

Liquor Business War: మునుగోడు సెగ్మెంట్ లో రచ్చకెక్కిన లిక్కర్ బిజినెస్ వార్

Corrupted Officer: 27 ఎకరాల భూమి.. చెప్పలేనన్ని ఆస్తులు.. రంగారెడ్డిలో భారీ అవినీతి తిమింగలం!

Ban on Drone: పరేడ్ గ్రౌండ్స్​ వద్ద డ్రోన్లపై నిషేధం.. ఇందుకు కారణం ఏంటంటే