Naga-Sadhus | తిరుపతిలో సాధువులు ఆమరణ దీక్షకు దిగారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు 150 మందికి పైగా సాదువులు, స్వామీజీలు ఆమరణ దీక్ష ప్రారంభించారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో నిర్మిస్తున్న హోటల్ ను ఆపేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారి పాదాల వద్ద ఈ హోటల్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ కొంత కాలంగా శ్రీనివాస నంద స్వామి పోరాటం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నేడు సాదువులు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా అంటూ వాళ్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోస్టర్లతో నినాదాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ దీనిపై స్పందించి యాక్షన్ తీసుకోవాలంటూ కోరుతున్నారు.
