Chiranjeevi
ఆంధ్రప్రదేశ్, ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi | నా రాజకీయ వారసుడు అతనే.. చిరంజీవి సంచలన ప్రకటన..!

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన రాజకీయ రీ ఎంట్రీ గురించి సంచలన ప్రకటన చేశారు. గత కొద్ది కాలంగా చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ నడుమ ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులతో పలు కార్యక్రమాల్లో చిరంజీవి (Chiranjeevi) పాల్గొంటున్నాడు. దాంతో చిరంజీవికి కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తున్నారని.. పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. వీటిపై తాజాగా మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు.

బ్రహ్మానందం కొడుకు రాగా గౌతమ్ నటించిన ‘బ్రహ్మ ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్​ గెస్ట్ గా వెళ్లాడు చిరంజీవి. అక్కడ మరోసారి రాజకీయాలపై మాట్లాడాడు. ‘నేను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నాకు ఆ ఉద్దేశమే లేదు. సినిమా రంగం అభివృద్ధి కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నాను. అంతే తప్ప రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తేలేదు. రాజకీయ పరంగా నా లక్ష్యాలను, సేవలను నెరవేర్చడానికి నా తమ్ముడు పవన్ కల్యాణ్​ ఉన్నాడు. అతను ఉండగా నాకు ఎలాంటి దిగులు లేదు’ అంటూ సంచలన ప్రకటన చేశాడు చిరంజీవి. అంటే రాజకీయ పరంగా తన లక్ష్యాలను సాధించే వారసుడు పవన్ అని చెప్పకనే చెప్పేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నడుమ వేదిక ఎక్కిన ప్రతిసారి పవన్ కల్యాణ్​ పేరు తీయకుండా చిరంజీవి స్పీచ్ కంప్లీట్ చేయట్లేదు. కాబట్టి పవన్ ను మరింత సపోర్టు చేసేందుకే చిరు ఇలా మాట్లాడుతున్నాడని చెబుతున్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు