Jagan on Chandrababu Age: చంద్రబాబు వయసుపై జగన్ టార్గెట్!
YSRCP leader Jagan Mohan Reddy addressing media, criticizing TDP chief Chandrababu Naidu’s leadership and age
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Jagan on Chandrababu Age: చంద్రబాబు వయసుని మళ్లీ టార్గెట్ చేసిన వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఒకటే చర్చ!

Jagan on Chandrababu Age: ‘‘ ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ జీవితానికి ఇదే చివరి ఎన్నికలు కావొచ్చు. రామా, కృష్ణా అనుకునే ఈ వయసులో.. కనీసం ఆ మాటలైనా అనుకుంటే పుణ్యమైనా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికి పోతావు’’… సీఎం చంద్రబాబుని ఉద్దేశించి కొన్ని నెలలక్రితం విపక్ష వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్న మాటలు ఇవీ. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైఎలక్షన్ సమయంలో అరాచకాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వృద్ధుడు అని చెప్పడం జగన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. తాజాగా మరోసారి కూడా ఇదే ఉద్దేశంతో జగన్ చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు.

‘‘వ‌య‌సేమో 80 ఏండ్లు.. మా నాయనతో పోటీ క‌థ దేవుడెరుగు.. కనీసం ఆయన కొడుకు వయసున్న నాతో పోటీ ప‌డ‌టానికి కూడా చంద్రబాబు అవ‌స్థలు ప‌డుతున్నాడు. నాలుగుసార్లు సీఎంగా ఉండి.. 80 పదుల వయసు దగ్గర పడుతున్నా చంద్రబాబుకి ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా?’’ అని జగన్ గురువారం (జనవరి 22) వ్యాఖ్యానించారు. దుష్ప్రచారం చేసి భూ సర్వే క్రెడిట్‌ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారని విమర్శిస్తూ వైసీపీ అధినేత ఈ మాటలు అన్నారు.

Read Also- Naini Coal Block Tender: నైనీ బొగ్గు గనుల టెండర్ రద్దు.. రంగంలోకి కేంద్రం.. విచారణకు ఆదేశం

చంద్రబాబు వయసు టార్గెట్ చేసుకొని జగన్ రిపీటెడ్‌గా చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా రాజకీయాల్లో అనుభవానికి మైలేజీ ఉంటుంది. కానీ, జగన్ మాత్రం దానిని చంద్రబాబు బలహీనతగా చూపేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జగన్ చేస్తున్న ఈ విమర్శ కేవలం ఒక వ్యక్తిగతమైనదే కాకపోవచ్చని, అది ఒక పక్కా రాజకీయ వ్యూహమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జగన్ వ్యూహం అదేనా?

ముఖ్యమంత్రి చంద్రబాబు తనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ, అపార అనుభవం తన బలం అని చెప్పుకుంటుంటే, జగన్ మాత్రం ఆ అనుభవం అవుట్ డేటెడ్ అని ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అనుభవంతో చంద్రబాబు చేసిందేంటి?, తన క్రెడిట్‌ను కొట్టేస్తున్నారని జగన్ హైలెట్ చేసే ప్రయత్నం పక్కా వ్యూహం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ తరహా విమర్శలు చేయడంలో లక్షిత ఉద్దేశాలు ఉండే ఉంటాయనే విశ్లేషిస్తున్నాయి. చంద్రబాబు పాతకాలపు నాయకుడనే భావనను కలిగించడం.. ఇదే సమయంలో తనను తాను డైనమిక్ లీడర్‌‌‌గా ప్రజెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన తండ్రి వైఎస్సార్‌తో చంద్రబాబుకు ఉన్న పాత వైరాన్ని గుర్తు చేయడం ద్వారా, ప్రత్యర్థి పార్టీలో నాయకత్వ మార్పు, భవిష్యత్తుపై ప్రశ్నలు సృష్టించడం జగన్ టార్గెట్ కావొచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విమర్శలను చంద్రబాబు, టీడీపీ కేడర్ ఏవిధంగా తిప్పికొడతారో వేచి చూడాలి.

Read Also- Singareni: సింగరేణి టెండర్లతో అసలు లబ్ధి పొందింది ఎవరు?.. దాచి పెట్టినా దాగని వాస్తవాలు ఏంటి..?

Just In

01

Uttam Kumar Reddy: అవినీతి, అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఊపేక్షించేది లేదు.. వారికి మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

Hydra: 6.12 ఎకరాల భూమి కబ్జా.. 3 ఎక‌రాల మామిడితోట ఎవ‌రిదంటే? హైడ్రా కీలక ప్రకటన!

Etela Rajender: మున్సిపోరుపై కమలం కసరత్తు.. రంగంలోకి ఎంపీ ఈటల!

BJP Telangana: మున్సిపోరుపై కమలం కసరత్తు.. ఉత్తర తెలంగాణపై ఫుల్ ఫోకస్!

Davos Summit: తెలంగాణ రైజింగ్ 2047కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్ధతు