Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఏటా హిట్లు మీద హిట్లు కొట్టేస్తున్న అనిల్ రావిపూడి మరో సారి సంక్రాంతికి రావడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా జరిగిన విలేఖరుల సమావేశంలో రాబోయే సినిమా గురించి ప్రస్తావించారు. ఇటీవల వైజాగ్ వెళ్లినపుడు మూవీ ఐడియా క్రాక్ అయిందని, టైటిల్ కూడా చాలా వెరైటీగా ఉంటుందని, అసలు ఆ సినిమా గురించి తెలుగు కుంటేనే వెరైటీగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇదే సందర్భంలో మళ్లీ సంక్రాంతికే వద్దామనుకుంటున్నానని, కొంత మంది ఇది జీర్ణించుకోలేరని గొడవ చేస్తారని చెప్పుకొచ్చారు. దీంతో మరో సారి అనిల్ రావిపూడి తీయబోయే సినిమా పై టాలీవుడ్ ఇండస్ట్రీలో బజ్ నెలకొంది. వరుసగా తొమ్మిది సినిమాలు హిట్ కావడంతో అనిల్ రవిపూడితో సినిమా తీయాలని టాప్ హీరోలు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే రాబోయే సినిమాకు హీరో గా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నాడని టాలీవుడ్ లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన ఏమే వెలువడ లేదు. అనిల్ తర్వాత సినిమా ఏం అయిఉంటుందా? ఎవరితో తీస్తారా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. మరో వారం పది రోజుల్లో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read also-TVK Party Symbol: విజయ్ టీవీకే పార్టీకి.. విజిల్ గుర్తు కేటాయింపు.. ఇక మోత మోగాల్సిందేనా!
ఇప్పటికే మెగాస్టార్ హీరోగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా తీసి సంక్రాంతి బ్లాడ్ బాస్టర్ కొట్టేశారు. దాదాపు మెగాస్టార్ సినిమా రూ.300 కోట్లుకు పైగా వసూలు చేసి 2026లో ఇండస్ట్రీ హిట్ గా మారింది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేస్తూ పల్లెల నుంచి ట్రక్టర్లు వేసుకుని మరీ జనం సినిమా చూడటానికి వచ్చేలా చేశారు. దీంతో మెగాస్టార్ స్టామినా ఎంటో మరోసారి తెలుగు సినిమా పరిశ్రమకు తెలిసేలా చేశారు. అయితే ఈ సినిమా లో గుర్తుండిపోయే ఓ పాత్ర చేసిన వెంకీ మామ, మెగాస్టార్ కాంబినేషన్ లో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు గా తెలుస్తోంది. ఈ విషయంపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Read also-David Reddy: మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్.. రాకింగ్ యాక్షన్ ఎప్పుడంటే?

