Naini Coal Block Tender: ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్‌ను సింగరేణి యాజమాన్యం (SCCL) అనూహ్యంగా రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఇద్దరు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో చేత్న శుక్లా (కోల్ డిప్యూటీ డైరెక్టర్), మర్పల్లి వెంకటేశ్వర్లు (కోల్ డైరెక్టర్) సభ్యులుగా ఉన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు వీరు సింగరేణిని సందర్శించి.. టెండర్ రద్దుకు గల కారణాలపై విచారణ జరపనున్నారు. అనంతరం ఆ నివేదిక కేంద్రానికి సమర్పించనున్నారు.
ఉదయం రద్దు.. మధ్యాహ్నానికి విచారణ
నైనీ బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించి ఇవాళ సా. 5 గంటలకు బిడ్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. అనూహ్యంగా దీనిని రద్దు చేస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం (SCCL) ఇవాళ ఉదయం ప్రకటించింది. కేవలం పాలనాపరమైన కారణాల వల్లనే టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే గత కొన్నిరోజులుగా నైనీ బొగ్గు గనుల టెండర్ అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ క్రమంలో టెండర్ ను సింగరేణి రద్దు చేయడం.. ఆ వెంటనే కేంద్రం ఎంట్రీ ఇవ్వడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించాయి.
ఇదేం కొత్త కాదు.. గతంలోనూ..
సింగరేణి కోల్ మైన్స్ పరిధిలోని నైనీ టెండర్ల విషయంలో వివాదాలు తలెత్తడం ఇది రెండోసారి. 2016లో కూడా ఈ తరహా ఆరోపణల వల్లే టెండర్లు రద్దయ్యాయి. పాలనాపరమైన కారణాల వల్ల టెండర్లను రద్దు చేస్తున్నామని.. పారదర్శక నిబంధనలతో మరోమాపు కొత్త టెండర్లు పిలుస్తామంటూ అప్పట్లోనూ సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. ఆ కాంగ్రెస్ హయాంలో తిరిగి టెండర్లు పిలవడం.. మళ్లీ రాజకీయ దుమారం చెలరేగడంతో వరుసగా రెండోసారి నైనీ కోల్ మైన్ టెండర్ రద్దు కావడం గమనార్హం.
Also Read: TVK Party Symbol: విజయ్ టీవీకే పార్టీకి.. విజిల్ గుర్తు కేటాయింపు.. ఇక మోత మోగాల్సిందేనా!
నైనీపై గొడవ ఎందుకు?
ఒడిశాలోని నైనీ ప్రాంతంలో 626 హెక్టార్ల బొగ్గు గని ఉంది. నాణ్యమైన బొగ్గు దొరికే ఈ ఏరియాను దక్కించుకుంటే మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. సింగరేణి భారీ టెండర్ దక్కించుకుంటే అనేక ఉపయోగాలు ఉన్నాయని వివిధ కంపెనీలు అనుకుంటున్నాయి. దీంతో సింగరేణికి కేటాయించిన వెయ్యి ఎకరాలకు పైగా మైనింగ్‌లో అందరూ భాగస్వామి కావాలని మైనింగ్ మాఫియా కోరుకుంటోంది. అందుకే ఇంతలా ప్రయత్నాలు చేస్తోంది. చివరికి మంత్రి, ఐఏఎస్ అంటూ ఓ ఛానల్ వార్తలు వడ్డించింది. దానికి కౌంటర్‌గా తొలి పలుకు అంటూ డిప్యూటీ సీఎం, మంత్రి ఫోటో వేసి వార్తలు సైతం వచ్చాయి.

