David Reddy: ‘మిరాయ్’ తర్వాత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇదే సందర్భంలో ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy) సినిమాను ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల డేట్ ను ఫిక్స్ చేశారు మూవీ టీం. అది ఎప్పుడంటే.. జనవరి 26, 2026 రిపబ్లిక్ డే రోజున ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు మంచు మనోజ్. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్‌పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి ఈ చిత్రానికి దర్శకుడు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా ‘డేవిడ్ రెడ్డి’ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది.
Read also-Malavika Mohanan: టాలెంట్ తొక్కేస్తున్నారు.. సరిగా వాడుకోవట్లేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
గత కొంతకాలంగా మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రీసెంట్‌గానే ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీలో మల్టీ హీరోల సినిమా చేసిన అనంతరం ‘మిరాయ్’లో విలన్‌గా కనిపించి, అందరినీ ఆకర్షించారు. ఇప్పుడు పూర్తి స్తాయి హీరోగా మళ్లీ తన స్టామినాను నిరూపించుకునేందుకు ఈ సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన డేవిడ్ రెడ్డి గ్లింప్స్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇలాంటి మనోజ్ నే కదా.. మనం చూడాలనుకుంటున్నాం అని అనిపిస్తుంది. పాప వాయిస్‌తో మొదలైన ఈ గ్లింప్స్.. ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా.. టాలీవుడ్ ‘కెజియఫ్’ని తలపిస్తోంది. సుభాస్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి ఇంకొకరి గురించి చెప్పాలి అంటూ ఇచ్చిన ఎలివేషన్ అయితే మాములుగా లేదు. అతను బ్రిటీషర్స్‌కి శత్రువే. ఇండియన్స్‌కు శత్రువే. 25 కోట్ల మంది కోపం వాడొక్కడి రక్తంలో నిండింది.. అలా పవర్ ఫుల్ డైలాగ్స్ మధ్య మంచు మనోజ్ డేవిడ్ రెడ్డిగా ఎంట్రీ ఇచ్చారు. ‘మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటీషర్స్‌కి.. అతను వార్ డాగ్ అయ్యాడు’ అంటూ చెప్పే డైలాగ్‌తో ఈ సినిమా ఏ స్థాయిలో రూపుదిద్దుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. చివరిలో ‘యే బ్రిటీష్ ఇండియా నహీ హే.. యే డేవిడ్ రెడ్డి కా ఇండియా హే’ అంటూ మంచు మనోజ్ డేత్ నోట్ పట్టి చెప్పిన డైలాగ్.. నిజంగానే ‘కెజియఫ్’ని మించిన సినిమా టాలీవుడ్‌లో రాబోతుందనే ఫీల్‌ని ఇచ్చిందంటే.. ఇక మంచు మనోజ్‌ని ఆపటం ఎవరితరం కాదంతే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు టాలీవుడ్ లో మంచు మనోజ్ స్టామినా ఏంటో తెలియ జేశాయి. రాబోయే ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూన్తున్నారు.
Read also-Happy Raj: జీవీ ప్రకాష్ ‘హ్యాపీ రాజ్’ ప్రోమో చూశారా.. అబ్బాస్ రీ ఎంట్రీ అదుర్స్
BRUTAL ERA BEGINS.
First Look — 26 jan 26#DavidReddy #BrutalEraBegins #WarDog@RiaboshapkaM @itshanumareddy @bharathmotukuri @venktareddy9916 @VSMotionPicture @truradix @dopvenu @RaviBasrur #UjwalKulakarni @SupremeSundar #SeshaBrahmam #HyndaviSuda #RamaiahDebbati… pic.twitter.com/f0H102q11k
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 22, 2026

