Medaram jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు మేడారం సిద్ధమవుతోంది. జనవరి 28 నుంచి 31వ తేదీ మధ్య 3 రోజుల పాటు జరగనున్న ఈ సమ్కక్క – సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే వన దేవతలు కొలువు దీరే గద్దెల ప్రాంతంలో భక్తుల కోసం మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నద్దమవుతోంది. ఈ క్రమంలోనే భక్తుల సౌకర్యార్థం హెలికాఫ్టర్ రైడ్స్ ను సైతం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆకాశం నుంచే వన దేవతలను దర్శించుకునే సదావకాశాన్ని భక్తుల ముందు ఉంచింది.
ఈ రోజు నుంచే రైడ్స్..
మేడారం మహా జాతరకు మరో వారం రోజుల సమయం ఉన్నప్పటికీ.. వన దేవతలను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఇప్పటికే తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సౌకర్యార్థం నేటి నుంటి హెలికాఫ్టర్ రైడ్స్ అందుబాటులో వచ్చాయి. పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ను అధికారులు ఏర్పాటు చేశారు. రైడ్ ఛార్జీల వివరాలను సైతం అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం.. 6-7 నిమిషాల పాటు జాతరను విహంగ వీక్షం చేసేందుకు ఒక్కొక్కరికి రూ.4,800 ఛార్జ్ చేయనున్నారు. నలుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీ.. ఒకసారి హెలికాఫ్టర్ రైడ్ చేయాలంటే దాదాపు రూ.20 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
TG: మేడారం జాతర భక్తుల కోసం నేటి నుంచి హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి 6-7 నిమిషాల పాటు జాతరను విహంగ వీక్షణం చేసే 'జాయ్ రైడ్' కోసం ఒక్కొక్కరికి రూ.4,800 ధర నిర్ణయించారు. అలాగే హన్మకొండ నుంచి మేడారానికి రానుపోను ప్రయాణానికి రూ.35,999… pic.twitter.com/TXrSgRSiQp
— ChotaNews App (@ChotaNewsApp) January 22, 2026
హనుమకొండ నుంచి రైడ్..
మేడారం జాతర సమయంలో వన దేవతల వద్దకు వెళ్లే అన్ని మార్గాలు పూర్తిగా ట్రాఫిక్ తో నిండిపోతుంటాయి. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్ లో వన దేవతల వద్దకు వెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. హనుమకొండ నుంచి మేడారం చేరుకొని.. వీహంగ వీక్షణం చేసేందుకు వీలు కల్పించింది. హనుమకొండ నుంచి మేడారంకు అప్ అండ్ డౌన్ ఛార్జీ ధరను రూ.35,999గా నిర్ణయించారు. నేటి (జనవరి 22) నుంచి జనవరి 31వ తేదీ వరకూ ఈ హెలికాఫ్టర్ రైడ్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5.20 గం.ల వరకు భక్తులకు రైడ్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
Also Read: Guntur district Murder: బరి తెగించిన భార్య.. భర్తను చంపి.. శవం పక్కన అశ్లీల వీడియోలు!
తొలిసారి వాట్సప్ సేవలు..
మరోవైపు మేడారం జాతరలో తొలిసారిగా వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతర వివరాలను భక్తులు తెలుసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. 7658912300 అనే నెంబర్ కు వాట్సాప్ లో Hai అని మెసేజ్ పెడితే వివరాలు అటోమేటిక్ గా మీ వాట్సప్ వచ్చేస్తాయి. జాతర సమాచారంతో పాటు ట్రాఫిక్, రవాణా, అత్యవసర సహాయం లాంటి వివరాలు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి భక్తులు ఈ వాట్సప్ సేవలను ఉపయోగించుకొని.. ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

