Ustaad BhagatSingh: తెలుగు గీతా రచయితలకు ప్రముఖులు, ఆస్కార్ స్థాయి అవార్డు అందుకున్న చంద్రబోస్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఆయన కలానికి మరింత పదుపు పెడుతున్నారు. బాలు సినిమాలో ఇంతే ఇంతింతే సాంగ్ ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే.. కూడా అదే స్థాయిలో హిట్ సాధించింది. ప్రస్తుతం మరొక్క సారి అలాంటి పాటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. బ్లాక్ బాస్టర్ బాక్ గ్రౌండ్ సాంగ్ రేడీ చేస్తున్నారు ఆస్కార్ విజేత రచయిత చంద్ర బోస్ అంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక పాట కోసమే ఇంత హైప్ ఇస్తున్నారు అంటే ఇక సాంగ్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పవన్ కళ్యాణ్ నుంచి మరో అదిరిపోయే సాంగ్ రాబోతుందంటూ పవర్ స్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Read also-Honey Teaser: నవీన్ చంద్ర ‘హనీ’ టీజర్ చూశారా.. సైకలాజికల్ హారర్ చెమటలు పట్టిస్తుంది
పవన్ కళ్యాణ్ సినిమాల్లో పాటలకు పెట్టింది పేరు. ఎందుకంటే ఆ పాటల్లో చాలా మీనింగ్ ఉంటుంది. ఎన్నో జీవిత సత్యాలను ఒక పాటలో ఇమిడ్చి ఎప్పుడూ చెబుతున్నట్లు గానే ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సారి రాబోతున్న సాంగ్ ఎలా ఉండబోతుందన్న కుతూహలం అభిమానుల్లో నెలకొంది. ఆస్కార్ రేంజ్ పాటల రచయిత ఈ సినిమాలో వపన్ కళ్యాణ్ సోల్ కి తగ్గట్లుగా పాట రాస్తున్నారంటేనే ఈ సాంగ్ హిట్ టాక్ సంపాదించుకుంది. అందులోనూ హిట్ కాంబినేషన్ హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా స్తాయిలో తన సత్తా చాటకున్న దేవీ శ్రీ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇచ్చిన సాంగ్ చాట్ బాస్టర్ గా నిలిచింది.
Read also-AR Rahman: ఏఆర్ రెహమాన్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఆర్జీవీ.. ఏం జరిగిందంటే?
ప్రస్తుతం మరో సాంగ్ కోసం ఇదే కలయికలో వస్తుందంటే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినామా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. సమ్మర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకునేందుకు ఈ సినిమా రాబోతుంది. పవన్ కళ్యాణ్ నుంచి ఈ సినిమా తర్వాత ఏ ప్రాజెక్టుకు సంబంధించి అప్టేడ్ రాకపోవడంతో ఉస్తాద్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనధికారకంగా పవన్ కళ్యాణ్ చివరి సినిమా అనే భావనలో కొందరు ఉన్నారు. కానీ సురేందర్ రెడ్డి దర్శర్వంలో సినిమా రాబోతుందని ప్రకటించారు. అది ఎంతవరకూ సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి మరి. ప్రస్తుతానకి ఈ పాట విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

