Tollywood Crisis: సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎంత పెడితే అంత పెద్ద సినిమా అనే సమాజంలో ఉన్నారు నిర్మాతలు. కథకు కనీస విలువ కూడా ఎలివేషన్లు మాత్రమే ఇస్తూ సినిమాలు తీస్తున్నారు. దీంతో సినిమాలు అప్పుడు విజయాలు సాధించినా తర్వాత రోజుల్లో సినిమాల గురించి ప్రేక్షకులు మర్చిపోయే స్థాయికి వచ్చేశారు. మంచి కథ తీస్తే జనాలు ఆదరిస్తారు అనడానికి చాలా ఉదాహరణలే ఉంటాయి. అంతే కానీ కథ లేకుండా ఎలాగోలా సినిమా తీసేసి ఎక్కువ బడ్జెట్ పెట్టేస్తే సినిమా పెద్దిది అయిపోదు అంటున్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అసలు థియేటర్లలో రేట్లు ఎందుకు మండిపోతున్నాయో, ఇది వరకు ఎలా ఉండేదో ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి సినిమా ఎంత భారం అవుతుంది అన్న విషయం చర్చకు వచ్చింది.
Read also-Mega 158: మెగా158లో కూతురు పాత్ర కోసం పోటీపడుతున్న ట్రెండీ హీరోయిన్స్.. ఎవరంటే?
అంతే కాకుండా ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల గురించి మాట్లాడుతూ.. తాను ఇక్కడ సినిమాలు చూడటానికి తన స్థోమత సరిపోవడంలేదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఒక రోజు కూర్చొంటే దాదాపు మూడు సినిమాలు కవర్ చేస్తానని, అంతే ఒక్కే సినిమాకు దాదాపు అయిదు వందలు వేసుకుంటే.. మొదటి రోజు అయితే ఏడు ఎనిమిది వందలు ఉన్నా కనీసం రెండు వేలు సినిమా చూడటానికి, పాప్ కార్న్ తినాలి అనుకున్నా.. అవో అయిదు వందలు, మంచి నీళ్లు తాగాలనుకున్నా అవో వంద రూపాయలు.. ఇది వరకు సినిమా థియేటర్లలో మంచి నీళ్లు ఉండేవి, ఇప్పుడు అవి కూడా లేదు.. ఇదంతా కలుపుకుని మొత్తం ఏడు ఎనిమిది వేలు అవుతుందని, దానిని అంత వెచ్చించే అంత స్థోమత తన దగ్గర లేదన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో విడుదలైన ఏ సినిమాను చూడలేదన్నారు. ఆర్టిస్టులకు అధిక రెమ్యూనరేషన్లు ఇచ్చి.. సినిమా పెద్దిది అని చెప్పుకోవడం తగదన్నారు.
Read also-Bharat Future City: దావోస్‌లో సీఎం రేవంత్‌తో యూఏఈ ప్రభుత్వం చర్చలు.. భాగస్వామ్యులం అవుతామంటూ..!
అందరూ రాజమౌళీ లాగా సినిమా తీయాలనుకుంటే కుదరదని, ఆయన ప్రతి రూపాయి సినిమా కు పెడతారని, కేవలం ఇవరై నుంచి ముప్పై శాతం మాత్రమే రెమ్యూనరేషన్ కు పెడతారని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వివాదం మరో వారి తెరపైకి వచ్చింది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే.. రానున్న రోజుల్లో సినిమా చూసేందుకు జనాలు ఉండరని, ఆయన చెప్పిన విషయాలు సినిమా పరిశ్రమకు కొంత ఆందోళన కలిగించినా.. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా మాయలో పడి అసలు కథలు చెప్పడంలేదని. రీజనల్ సినిమాలే పాన్ ఇండియాను ఏలుతున్నాయని, అంతే తప్పితే వేరే విధంగా సినిమా తీస్తే అసలు ఆడదని చెప్పుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

