GHMC: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లకు కసరత్తు ప్రారంభం
GHMC (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

GHMC: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లకు కసరత్తు ప్రారంభం.. ఎన్నికల నిర్వహణ పై కీలక అప్డేట్..?

GHMC: జీహెచ్ఎంసీ పరిధిలోని మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లకు కసరత్తు మొదలైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవలే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో పెరిగిన పరిధిని ఇటీవలే అధికారులు 300 వార్డులుగా పునర్విభజించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 10వ తేదీతో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియనున్నది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా పాలక మండలి గడువు ముగిసిన తర్వాత జీహెచ్ఎంసీ(GHMC) మినహా మరో రెండు మున్సిపల్ కార్పొరేషన్లను చేసే ప్రక్రియతో పాటు వార్డుల రిజర్వేషన్‌లను ఖరారు చేసే ప్రాసెస్‌లను సమాంతరంగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. పాత జీహెచ్‌‌‌ఎంసీలోని 150 వార్డులతో పాటు విలీన పట్టణ స్థానిక సంస్థల పరిధిని కలుపుకొని పునర్విభజించిన మొత్తం 300 వార్డులకు ఇప్పటికే అధికారులు కేటాయించిన వరుస సంఖ్యలు కూడా మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసే సమయంలో మారే అవకాశాలున్నట్లు సమాచారం.

మహిళలకు 50 శాతం

వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతే కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఛైర్ పర్సన్ (మేయర్) సీటు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. తొలుత 300 వార్డులను 150 వార్డులతో జీహెచ్ఎంసీ, మిగిలిన 150 వార్డులలో 76 వార్డులతో గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, మరో 74 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ఈ రెండు కార్పొరేషన్‌ల పరిధిలోకి రానున్న వార్డుల వరుస సంఖ్యలను మార్చి, వార్డుల్లోని ఎన్యుమరేషన్ బ్లాకుల వారీగా ఎస్సీ, ఎస్టీ(ST) జనాభా లెక్కలను సేకరించి, ఎక్కువ జనాభా కలిగిన సామాజికవర్గానికి వార్డులను రిజర్డ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియలో మహిళలకు 50 శాతం వార్డులను కేటాయించేలా రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సిద్దమైనట్లు సమాచారం. జనాభా ప్రకారం రెండు కార్పొరేషన్లలో మెజార్టీ వార్డులు రిజర్డ్ అయ్యే సామాజికవర్గానికి ఛైర్ పర్సన్( మేయర్ )సీటును రిజర్డ్ చేసే అవకాశం ఉన్నట్లు కొందరు రెవెన్యూపై పట్టున్న అధికారులు చెబుతున్నారు. అయితే, ఇటీవలే మున్సిపల్ శాఖ పని కార్పొరేషన్లకు ఖరారు చేసిన రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని కొత్తగా ఏర్పడనున్న మరో రెండు కార్పొరేషన్లను కలిపి 12 మున్సిపల్ కార్పొరేషన్ల ప్రాతిపదికన ఛైర్ పర్సన్ సీట్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: Bhatti Vikramarka: అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు… డిప్యూటీ సీఎం భట్టి స్పష్టత

మారనున్న జీహెచ్ఎంసీ మేయర్ సీటు రిజర్వేషన్

త్వరలో 117 మున్సిపాల్టీలు, మరో పది మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు లో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ సీటును మహిళా జనరల్‌గా క్యాటగిరి కింద ఇటీవలే మున్సిపల్ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, ఇదంతా రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టిన, ప్రకటించిన రోజు నాటి పరిస్థితులను అంటే జీహెచ్ఎంసీలోని 300 వార్డులను పరిగణలోకి తీసుకుని ప్రకటించారు. కానీ త్వరలోనే మూడు ముక్కలు చేసే సమయంలో జీహెచ్ఎంసీ మరోసారి రూపాంతరం చెందిన 150 మున్సిపల్ వార్డులకు పరిమితం కానున్నందున, ఆ వార్డుల్లో వివిధ సామాజిక వర్గాల వారీగా జనాభా లెక్కలను తేల్చిన తర్వాత150 వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసి, ఎక్కువ మెజార్టీ సీట్లు రిజర్వు అయ్యే సామాజికవర్గానికి మేయర్ సీటు రిజర్వు కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సీటును మహిళా జనరల్‌గా రిజర్వ్ చేసినా, వార్డుల రిజర్వేషన్లు, కొత్తగా ఏర్పడనున్న రెండు మున్సిపల్ కార్పొరేషన్ల ఛైర్ పర్సన్లు, జీహెచ్ఎంసీ మేయర్ సీట్ల రిజర్వేషన్ సమయంలో జీహెచ్ఎంసీ మేయర్ సీటు క్యాటగిరి కూడా మహిళా జనరల్ నుంచి వేరే క్యాటగిరికి మారే అవకాశాలున్నాయి.

గడువు ముగిసిన తర్వాత ఎన్నికల ఏర్పాట్లకు మూడు నెలలు

వచ్చే నెల 10వ తేదీతో జీహెచ్ఎంసీలోని పాలక మండలి గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటే ఏర్పాట్లకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని ఎన్నికల విభాగం అధికారులు వెల్లడించారు. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లు, ఆ తర్వాత మూడు కార్పొరేషన్‌లలోని వార్డుల రిజర్వేషన్లు, ఆ తర్వాత చైర్ పర్సన్ల రిజర్వేషన్ల ప్రక్రియలను చేపట్టాల్సి ఉంటుందని, ఆ తర్వాత కొత్త ఓటర్ల నమోదు, వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ముసాయిదా, ఓటర్ల డ్రాఫ్ట్, ఆ తర్వాత తుది జాబితాలు సిద్ధం చేసిన తర్వాత సర్కార్ ఆదేశాల మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశముంది. దాదాపు మే మాసం చివరలో గానీ, జూన్ మొదటి వారంలో గానీ జీహెచ్ఎంసీ, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు ఉన్నతాధికారవర్గాల సమాచారం.

Also Read: Traffic Challans: ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు సీరియస్.. చలాన్లు కట్టాలని బలవంతం చేయవద్దు..!

Just In

01

Minister Vakiti Srihari: సబ్‌స్టేషన్‌ నిర్మాణ స్థలం కోసం స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి

Vanga Geetha: పవన్‌పై పోటీ చేసిన వంగా గీత బిగ్ ట్విస్ట్?.. జోరుగా సాగుతున్న ప్రచారం ఇదే!

Viral Video: అగ్గిపెట్టెంత ఇల్లు.. రూ.1.2 కోట్లు అంట.. కొనేవాళ్లు మరీ అంత పిచ్చోళ్లా!

AR Rahman: ఏఆర్ రెహమాన్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఆర్జీవీ.. ఏం జరిగిందంటే?

Davos Summit 2026: దావోస్‌లో సీఎం దూకుడు.. రేవంత్ విజన్‌కు టాప్ కంపెనీలు ఇంప్రెస్.. మరో భారీ డీల్ సెట్!