Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revantn Reddy) తెలిపారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Minister Manohar Lal Khattar)తో జరిగిన సమావేశం మేరకు, మెట్రో ఫేజ్-II కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేపడుతున్నదని తెలుపుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishna Reddy)కి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
Also Read: Revenge Politics: జగన్ బాటలో కేటీఆర్.. ప్రభుత్వాన్ని వదిలేసి.. అధికారులపై చిటపటలు!
నిరంతరం సంప్రదింపులు
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇద్దరు అధికారులతో కూడిన ఒక సంయుక్త కమిటీలో చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు అధికారులను నామినేట్ చేసేందుకు వేచి చూస్తున్నదని కిషన్ రెడ్డి జనవరి 15 వ తేదీన రాసిన లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ, దానికి సంబంధించిన వివరాలను కూడా ముఖ్యమంత్రి తన లేఖలో తెలియజేశారు. కమిటీ కూర్పునకు సంబంధించిన వివరాలను ఇప్పటికే కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలియజేశామని పేర్కొన్నారు. మెట్రో రైల్ ఫేజ్-II మంజూరు కోసం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫేజ్-II ప్రాజెక్టును తన పలుకుబడిని ఉపయోగించి వీలైనంత తొందరగా ఆమోదింపజేయాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో కోరారు.
Also Read: Sonu Sood Praises Pawan: డిప్యూటీ సీఎం పవన్‌పై సోనూసూద్ పొగడ్తలు.. వీడియో ఇదిగో

