Traffic Challans: చలాన్లు వసూలు చేస్తున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు(High Cort) మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనదారుడు స్వచ్ఛందంగా జరిమానా చెల్లించడానికి ముందుకొచ్చినప్పుడే చలానా మొత్తం తీసుకోవాలని పేర్కొంది. తప్పితే వాహనాలను సీజ్ చేయడం.. తాళం చెవులు లాక్కోవడం చేయొద్దని ఆదేశించింది. ట్రాఫిక్ పోలీసులు తమ తమ మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీస్తూ ఎడాపెడా జరిమానాలు వేస్తున్నారంటూ సెప్టెంబర్ నెలలో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పిటిషనర్ తరపున న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు.
Also Read: Bhatti Vikramarka: అసాధ్యాన్ని సాధ్యం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం: భట్టి విక్రమార్క
అత్యవసర పనుల మీద..
తనిఖీల సమయంలో ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉండే హ్యాండ్ హెల్డ్ పరికరం ద్వారా చెక్ చేస్తూ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పి వాహనాలను తీసేసుకుంటున్నారని చెప్పారు. మొత్తం చలాన్లు క్లియర్ చేస్తేనే బండి ఇస్తామని చెబుతున్నారన్నారు. ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేదని చెబితే అది మీ సమస్య అని అంటున్నారన్నారు. దీనివల్ల అత్యవసర పనుల మీద వెళ్తున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ఇకపై మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసి జరిమానాలు విధించవద్దని ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాలతో కోర్టుకు నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖను సూచించింది. వాయిదా ఉన్న నేపథ్యంలో మరోసారి మంగళవారం దీనిపై హైకోర్టు విచారణ చేసింది. పోలీసులు ఎలాంటి వివరాలు ఇవ్వక పోవటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతోపాటు వాహనదారుల నుంచి బలవంతంగా జరిమానా డబ్బు వసూలు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. చలానా కట్టటానికి ఎవరైనా నిరాకరిస్తే వారికి కోర్టు నుంచి నోటీసులు జారీ చేయించాలని పేర్కొంది.
Also Read: Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

