Ticket Hike: సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు మరో సారి తీవ్రస్థాయిలో స్పందించింది. తెలంగాణ హైకోర్టు ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలైన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana ShankaraVaraPrasad Garu) చిత్రాల టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హోమ్ శాఖ సెక్రటరీ (ప్రస్తుతం సీవీ ఆనంద్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు) బుక్ మై షో సీఈఓకు హైకోర్టు కంటెంప్ట్ నోటీసులు జారీ చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వడంపై ఈ నిర్ణయం తీసుకుంది. ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాకు సంబంధించి టికెట్ ధరల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా దాచారని, ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనని పిటిషనర్ వాదించారు. ప్రభుత్వం అర్ధరాత్రి పూట జారీ చేస్తున్న ‘స్పెషల్ మెమోల’ ద్వారా టికెట్ రేట్లు పెంచడాన్ని కోర్టు తప్పుబట్టింది. ‘ది రాజా సాబ్’ సినిమాకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మెమోను హైకోర్టు కొట్టివేసింది.
Raed also-Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమాకు ఎన్టీఆర్ రివ్యూ.. ఏం అన్నారంటే?
హైకోర్టు కీలక ఆదేశాలు
భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండటానికి కోర్టు కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఇకపై ఏ సినిమాకైనా సరే, టికెట్ ధరలు పెంచాలనుకుంటే ఆ సినిమా విడుదల కావడానికి 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోర్టు ఆదేశించింది. చివరి నిమిషంలో (Last Minute) మెమోలు జారీ చేసి రేట్లు పెంచడం కుదరదని స్పష్టం చేసింది. టికెట్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం హోమ్ శాఖ సెక్రటరీకి లేదని, చట్టప్రకారం అది పోలీస్ కమిషనర్లు లేదా జిల్లా కలెక్టర్లకే ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. 2021లో ప్రభుత్వం జారీ చేసిన G.O. Ms 120 ప్రకారం నిర్ణయించిన రేట్లనే అమలు చేయాలని, ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం కోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందకే వస్తుందని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.
Read also-VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు
వివాదానికి నేపథ్యం
గత నెలలో బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ ఇటీవల ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ సినిమాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక మెమోల ద్వారా రేట్లు పెంచేందుకు అనుమతించింది. అయితే, ఒకవైపు మంత్రులు ‘టికెట్ రేట్లు పెంచం’ అని బహిరంగంగా ప్రకటిస్తూనే, మరోవైపు అధికారులు సీక్రెట్‌గా మెమోలు ఇవ్వడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఒక పెద్ద బడ్జెట్ సినిమా విషయంలో చివరివరకూ మెమో ఇవ్వకుండా అసలు ప్రభుత్వం ఎం చేసిందని, ప్రస్తుతం రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న పెద్ద సినిమాతో పోలుస్తూ చివరివరకూ టికెట్ రేట్లుపెంచక పోవడంతో ఆ సినిమా కొంత నష్టాలు చూడాల్సి వచ్చిందని నిర్మాణ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు.

