Ramya Rao: మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్(Santhosh Kumar), ప్రదీప్ రెడ్డి(Pradeep Redy), లిక్కర్ స్కామ్ నిందితుడు శ్రీనివాస్ రావు(Srnivasa Rao)లపై కాంగ్రెస్ మహిళా నేత రమ్యా రావు(Ramya Rao) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఫిర్యాదు చేశారు. 2013 నుంచి వీరంతా అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారని, పక్కనే ఉన్న తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు.
లిక్కర్ స్కామ్‌లో పెట్టుబడి..
ఈ క్వారీ దందాల ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయల అక్రమ సొమ్మును లిక్కర్ స్కామ్‌లో పెట్టుబడిగా పెట్టారని రమ్యా రావు సంచలన ఆరోపణలు చేశారు. అనేక భూ దందాలకు పాల్పడుతూ తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, చివరికి ఆడపిల్లలను కూడా వదలకుండా సోషల్ మీడియాలో అసభ్యకరంగా తిట్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: DGP Office Scandal: డీజీపీ ఆఫీసులో రాసలీలలు.. వైరలవుతున్న వీడియో.. సీఎం సీరియస్!
అక్రమ మార్గాల్లో క్వారీలు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సంతోష్(Santhosh) తన పాత పద్ధతులతో అధికారులను, డిపార్ట్‌మెంట్లను మేనేజ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికీ తామే అధికారంలో ఉన్నట్లుగా సంతోష్ అండ్ గ్యాంగ్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సంతోష్, ప్రదీప్, శ్రీనివాస్ కలిసి అక్రమ మార్గాల్లో క్వారీలను తమ పేర్ల మీదకు బదిలీ చేసుకుంటున్నారని వివరించారు. ఈ అక్రమ ఆస్తుల వ్యవహారంపై, వేధింపులపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె ఈడీని కోరారు. ప్రభుత్వం మారినా వీరి ఆగడాలు తగ్గడం లేదని, బాధితులకు న్యాయం జరగాలని రమ్యా రావు డిమాండ్ చేశారు.
జోగినపల్లి సంతోశ్ రావు మరియు టీమ్‌పై ఫిర్యాదు చేశా: రమ్యరావు
మైనింగ్ క్వారీలు చేసుకుంటూ వచ్చిన లాభాలను లిక్కర్ స్కామ్‌లో పెట్టారు
చర్యలు తీసుకుంటామని ఈడీ అధికారులు హామీ ఇచ్చారు
– రమ్యరావు https://t.co/sMrVP3iCjw pic.twitter.com/Xj4jofpKWA
— BIG TV Breaking News (@bigtvtelugu) January 19, 2026
Also Read; CM Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ విజన్.. రైజింగ్ 2047ను ప్రదర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

