Naresh Birthday: నరేష్ 30 నిమిషాలు కేటాయిస్తే గొప్ప.. పవిత్ర లోకేష్
pavitra-lokesh
ఎంటర్‌టైన్‌మెంట్

Naresh Birthday: నరేష్ 30 నిమిషాలు కేటాయిస్తే గొప్ప.. పవిత్ర లోకేష్.. ఏం చేస్తారంటే?

Naresh Birthday: ప్రముఖ సీనియర్ నటుడు నరేశ్ 65వ పుట్టినరోజు సందర్భంగా తన సినిమా శుభ కృత నామ సంవత్సరం నుంచి గ్లింప్స్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా వేడుకలో పవిత్ర లోకేశ్, నరేష్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ.. 54 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం ఉన్న నరేశ్‌తో తోడుగా ఉండటం తన అదృష్టమని, ఆయన ప్రతి పాత్రకోసం రాత్రింబవళ్లు ఎంతో శ్రమిస్తారని కొనియాడారు. అంతబిజీగా ఉన్నా రోజుకు 30 నిమిషాలు తనకోసం కేటాయిస్తారని తెలిపారు. నరేశ్ కూడా స్పందిస్తూ.. ‘నాలోసగం పవిత్ర, తను నాలక్కీ ఛార్మ్” అని ఎమోషనల్ అయ్యారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ వీడియో తెగ వైరల్ అవుతుంది.

Read also-Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!

నరేష్ గారికి పరిశ్రమలో 54 ఏళ్ల అనుభవం ఉందని, ఆయనతో జీవితం గడపడం దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నానని పవిత్ర లోకేష్ తెలిపారు. ఆయన ప్రతి చిన్న క్యారెక్టర్‌కు కూడా ఎంతో కష్టపడి సిద్ధమవుతారని కొనియాడారు. అంతే కాకుండా నరేష్ ఎప్పుడూ తన పాత్రల కోసం ప్రిపేర్ అవుతూ బిజీగా ఉంటారని, ఆయనతో మాట్లాడాలన్నా తాను అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి వస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో ఆమె నరేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ జన్మలోనే కాకుండా వచ్చే జన్మలో కూడా తనతో కలిసి ఉండాలని కోరుకున్నారు. సినిమా గ్లింప్స్‌లోని డైలాగులు నరేష్ నిజ జీవిత తత్వానికి (లైఫ్ ఫిలాసఫీకి) దగ్గరగా ఉన్నాయని ఆమె అన్నారు. ఆయన ఎప్పుడూ చాలా సింపుల్ గా ఉంటారని లైఫ్ లీడ్ ఎలా చేయాలో ఆయన్ని చూసి నేర్చుకోవాలని, ప్రతి విషయాన్ని చాలా సింపుల్ గా తీసుకుంటారని అన్నారు. అలాగే, ఈ సినిమా కన్నడ తెలుగు భాషల్లో రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాకుండా తాను తెలుగు ఇంత బాగా మాట్లాడటానికి కారణం నరేష్ గారేనని ఆమె పేర్కొన్నారు.

Read also-TGFA Awards: 2025 గద్దర్ అవార్డులకు రంగం సిద్ధం.. 17 విభాగాల్లో దరఖాస్తుల ఆహ్వానం..

Just In

01

Ticket Hike: సినిమా టికెట్ల వివాదంపై మరో సారి సీరియస్ అయిన తెలంగాణ హైకోర్ట్..

Bhatti Vikramarka: అసాధ్యాన్ని సాధ్యం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం: భట్టి విక్రమార్క

Nitin Nabin – Modi: నేను బీజేపీ కార్యకర్తను… నాకు బాస్ నితిన్ నబీన్.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమాకు ఎన్టీఆర్ రివ్యూ.. ఏం అన్నారంటే?

Ramya Rao: అక్రమ దందాలపై.. బీఆర్ఎస్ మాజీ ఏంపీ జోగినపల్లి సంతోష్‌పై ఈడీకి ఫిర్యాదు.!