Medaram Jatara 2026: మేడారం భక్తులకు గుడ్ న్యూస్..!
Medaram Jatara 2026 (imagecredit:twitter)
Telangana News, ఖమ్మం

Medaram Jatara 2026: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. జాతరలో ఆ భయం లేదిక..?

Medaram Jatara 2026: తెలంగాణా కుంభమేళాగా పేరుపొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణా సర్కార్ శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. మంత్రి సీతక్క మేడారం మహా జాతర బాధ్యతను భుజాల మీద వేసుకుని మరీ పని చేస్తున్నారు. ఈసారి మేడారం జాతరలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని భావిస్తున్నారు. దీంతో మేడారం జాతర సకల హంగులతో కొత్త రూపు సంతరించుకోబోతుంది.

కమాండ్ కంట్రోల్ రూమ్

జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహోత్సవం కోసం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. ఇక తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదివారం భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి, జాతరలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు.

టీజీ క్వెస్ట్ అత్యాధునిక డ్రోన్ వ్యవస్థ

మేడారం 2.0’లో భాగంగా మేడారం జాతరలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ఎవరూ తప్పిపోకుండా ప్రజలందరికీ సురక్షిత జాతర అనుభవం కలిగించేలా జాతర భద్రతను పర్యవేక్షించేందుకు ‘టీజీ-క్వెస్ట్‌’ అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ ద్వారా 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీ రోడ్లపై ఈ డ్రోన్లు నిరంతరం నిఘా ఉంటాయి.

13 వేల మంది పోలీస్ సిబ్బంది

అవి మాత్రమే కాకుండా హీలియం బెలూన్లకు అమర్చిన పాన్-టిల్ట్-జూమ్ కెమెరాలు ఎత్తు నుంచి రద్దీని విశ్లేషిస్తాయి. తొక్కిసలాట జరిగే అవకాశమున్న ప్రాంతాలను ముందే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేస్తాయి. దాదాపు 13 వేల మంది పోలీసు సిబ్బంది ఈ టెక్నాలజీ సర్వైలెన్స్ లో విధులు నిర్వహించనున్నారు. మేడారం జాతరలో చాలా పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు కాబట్టి ఎక్కువ శాతం తప్పిపోయే అవకాశం ఉంటుంది.

Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జులుగా.. తెలంగాణ మంత్రులు.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే!

జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్

దాదాపు ఈసారి మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న క్రమంలో జాతరకు వచ్చే భక్తులు ఎవరూ తప్పిపోకుండా చర్యలను చేపడుతున్నారు. గత జాతరలో దాదాపు 30 వేల మంది వరకు తప్పిపోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ‘జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ వ్యవస్థను తీసుకు వస్తున్నారు. వొడాఫోన్-ఐడియా సహకారంతో ఈ విధానం అందుబాటులో ఉంటుంది.

క్యూఆర్ కోడ్, జియో ట్యాగ్‌లతో తప్పిపోకుండా చర్యలు

పస్రా, తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ గల జియోట్యాగ్‌లను కడతారు. దీంతో వారు ఎవరైనా తప్పిపోయినా ఈ ట్యాగ్ ను స్కాన్ చేయటం ద్వారా వారి పూర్తి వివరాలు తెలుస్తాయి. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో అమలు చేయటానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.

ప్రత్యేకంగా 12 క్రైమ్ బృందాలు

తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. జాతరలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేకంగా 12 క్రైమ్ బృందాలు పనిచేస్తున్నాయి. పాత నేరస్థుల గుర్తింపునకు ఆసుపత్రి ప్రాంగణాలు, పార్కింగ్ స్థలాల వద్ద ‘ఫేస్ రికగ్నిషన్’ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్-టైమ్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా సిద్ధం చేశారు.

Also Read: Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!

Just In

01

Jurala Project: జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం వద్దకు వెళ్లిన మంత్రి శ్రీహరి

Ticket Hike: సినిమా టికెట్ల వివాదంపై మరో సారి సీరియస్ అయిన తెలంగాణ హైకోర్ట్..

Bhatti Vikramarka: అసాధ్యాన్ని సాధ్యం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం: భట్టి విక్రమార్క

Nitin Nabin – Modi: నేను బీజేపీ కార్యకర్తను… నాకు బాస్ నితిన్ నబీన్.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమాకు ఎన్టీఆర్ రివ్యూ.. ఏం అన్నారంటే?