Bird Flu
ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం

Bird Flu | ఏపీలో బర్డ్ ఫ్లూ.. ఆ జిల్లాల్లో చికెన్ తినే వాళ్లు జాగ్రత్త..!

Bird Flu | ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కోళ్లు గత జనవరి నెల నుంచి లక్షల్లో చనిపోతున్నాయి. ఏ పౌల్ట్రీ ఫామ్ లో చూసినా కుప్పలు, తెప్పలుగా కోళ్లు చచ్చిపోతున్నాయి. మరీ ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలోని కానూరు ప్రాంతంలోని రెండు ఫామ్ లలో చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను మధ్యప్రదేశ్ లోని భోపాల్ నేషనల్ ల్యాబ్ కు పంపించగా.. బర్డ్ ఫ్లూ(Bird Flu) పాజిటివ్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దాంతో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పౌల్ట్రీ ఫామ్ లలోని కోళ్లను, గుడ్లను పూడ్చి పెట్టాలని ఆదేశించారు. ఆ ప్రాంతంలో ఉండే చికెన్ సెంటర్లను కూడా మేసేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు.

మిగతా జిల్లాల్లో పెద్దగా ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం లేదని.. అక్కడి చికెన్ సెంటర్లను మూసేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక పూడ్చిపెట్టిన ప్రతి కోడికి రూ.90 వరకు నష్టపరిహారం ఇస్తామన్నారు. ఉత్తర భారతదేశం నుంచి చలికాలంలో ఏపీకి వచ్చిన కొన్ని పక్షుల నుంచే ఈ బర్డ్ ఫ్లూ సోకిందని అధికారులు గుర్తించారు. ఈ వైరస్ 34 సెం.మీ వేడి దగ్గర బతకలేదని.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అంతకన్నా ఎక్కువ వేడి ఉన్నట్టు వివరించారు. ప్రజలు చికెన్ ను బాగా ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?