Bigg Boss 9 Tamil Winner: బిగ్ బాస్ 9 తమిళ్ విన్నర్ ఎవరంటే..
Divya Ganesh holding the Bigg Boss Tamil Season 9 winner trophy on stage with host Kamal Haasan during the grand finale.
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!

Bigg Boss 9 Tamil Winner: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్‌గా కళ్యాణ్ పడాల (Kalyan Padala) నిలిచిన విషయం తెలిసిందే. తెలుగు సీజన్ మొదలైన కొన్ని రోజులకు తమిళ బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss Tamil Season 9) మొదలైంది. జనవరి 18 ఆదివారం గ్రాండ్ ఫినాలేను నిర్వహించారు. ఈ ఫినాలేలో దివ్య గణేష్ (Divya Ganesh) విన్నర్‌గా నిలిచారు. 24 మంది కంటెస్టెంట్స్‌తో 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్‌లో దివ్య గణేష్, శబరి నాథన్, విక్రమ్, అరోరా వంటి టాప్ ఫైనలిస్ట్‌ల ప్లేస్‌ను సొంతం చేసుకున్నారు. వీరిలో ఈ సీజన్‌లోకి 28వ రోజున వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన దివ్య గణేష్ విన్నర్‌గా నిలవడం విశేషం. హోస్ట్ విజయ్ సేతుపతి చివరి నిమిషం వరకు ఉత్కంఠగా ఈ షో ను నిలిపారు. విజయ్ సేతుపతి విన్నర్ అంటూ దివ్య గణేష్ చేతికి పైకి ఎత్తగానే.. ఆమె కూడా నమ్మలేకపోయింది. ఒక్కసారిగా షాక్‌కు గురైంది. శబరి నాథన్ రన్నరప్‌గా నిలిచారు. దివ్య విన్నర్ అని సేతుపతి ప్రకటించగానే శబరి నాథన్ ఆనందంతో విజిల్ వేసి సందడి చేయడం చూస్తున్న వారందరికీ హ్యాపీగా అనిపించింది.

Also Read- Anasuya Bharadwaj: హత్యాచారం చేసిన వారికి మరణశిక్ష బిల్‌.. అనసూయ షాకింగ్ పోస్ట్!

ప్రైజ్ మనీ ఎంతంటే..

ఇక విన్నర్‌గా గెలిచిన దివ్య గణేష్‌కు ప్రైజ్ మనీ ఎంత వచ్చిందంటే.. అక్షరాలా యాభై లక్షల రూపాయలు. డబ్బు మాత్రమే కాదు, ఓ ఎస్‌యూవీ కారు కూడా ఆమెకు బ‌హుమ‌తిగా ఇచ్చారు. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఆమె పేరును వైరల్ చేస్తూ.. ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. తెలుగు బిగ్ బాస్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. కళ్యాణ్ పడాల అభిమానులు మొదటి నుంచి సోషల్ మీడియాను ఆక్రమించేశారు. ఫైనల్‌గా ఓట్లు విషయంలో టాప్ ప్లేస్‌లో ఉండేలా చేశారు. ఇప్పుడు దివ్య గణేష్‌కు కూడా ఓట్లు దిట్టంగా వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆమెను విన్నర్‌గా ప్రకటించారు. ఇక దివ్య గణేష్ విషయానికి వస్తే.. ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. అదెలా అనుకుంటున్నారా?

Also Read- Renu Desai: అందుకే పవన్ కళ్యాణ్ నీ నుంచి విడిపోయాడు.. అలాంటి థంబ్స్ పెట్టకండి ప్లీజ్!

తెలుగు ప్రేక్షకులకు పరిచయమే..

తెలుగులో ఆమె సినిమాలు, సీరియల్స్ చేశారు. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘నిను వీడని నీడను నేనే’ (Ninu Veedani Needanu Nene) అనే సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో దివ్య గణేష్ నటించారు. అలాగే ‘కీ’ అనే సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించారు. ఇంకా ‘భాగ్యలక్ష్మి’ అనే సీరియల్‌లో శిరీష అనే పాత్రలో నటించి మంచి ఆదరణను పొందరు. ‘మా అత్త బంగారం’ అనే సీరియల్‌లో కూడా ఆమె ప్రధాన పాత్రను పోషించారు. ప్రస్తుతం ‘ద్రౌపది 2’ అనే తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే దివ్య గణేష్ ఓటింగ్ శాతం ఎక్కడా తగ్గలేదని, తెలుగు వారు కూడా ఆమె విజయంలో ఓ చెయ్యి వేశారనేలా టాక్ నడుస్తోంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9‌లో కర్ణాటకకు చెందిన తనూజ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!