Naini Coal Block: మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్
Harish Rao speaking to the media about Neyveli coal block tender controversies.
Telangana News, లేటెస్ట్ న్యూస్

Naini Coal Block: బొగ్గు బ్లాక్ టెండర్లపై ఆరోపణల వేళ.. మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్

Naini Coal Block: నైనీ బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణకు ఆదేశించాలి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాటకు కట్టుబడి ఉండాలి
కాంగ్రెస్ బొగ్గు స్కాంపై కోర్టులకు వెళ్లి కొట్లాడుతాం
అన్ని టెండర్లు రద్దు చేయాలి
సైట్ విజిట్ విధానం శాశ్వతంగా రద్దు చేయాలి: మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: నైనీ బొగ్గు గనుల (Naini Coal Block) టెండర్లపై సీబీఐ (CBI) విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. సింగరేణి టెండర్ల కుంభకోణం, సీఎం, మంత్రుల వాటాల పంచాయతీలు చూస్తున్నామని, మరికొన్ని దిమ్మదిరిగే విషయాలు బయట పెడుతున్నామన్నారు. ‘‘కాంట్రాక్టు సైట్ విజిట్ పద్దతి నైనీ బ్లాక్‌ను పెట్టారు, అందువల్ల నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని భట్టి అన్నారు. కాంట్రాక్టు సైట్ విజిట్ పద్దతి మన రాష్ట్రంలో లేదు. దేశంలో లేదు. వెస్టన్ కోల్ ఫీల్డ్, కోల్ ఇండియాలో కూడా లేదు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 2024లో సైట్ విజిట్ విధానం తెచ్చారు. ఈ విధానం వచ్చాక మొదటి లబ్దిదారులు రేవంత్ బామ్మర్ది సుజన్ రెడ్డి. ఆయన కంపెనీ శోదా కన్‌స్ట్రక్చన్‌కే ఈ సర్టిఫికేట్ వచ్చాక మొదటి టెండర్ దక్కింది. ఈ విధానం వచ్చాక సింగరేణిలో 6 టెండర్లు కూడా ప్లస్ 7 పర్సంటేజ్‌కు టెండర్లు వారి అనుయాయులకు కట్టబెట్టడం జరిగింది. ఎనీ ఓబీ కోల్ బ్లాక్ టెండర్ మన దేశంలో ఎక్కడ జరిగినా మైనస్ 10 నుంచి మైనస్ 22 శాతానికి పోతుంది’’ అని హరీష్ రావు అన్నారు. ‘‘గతంలో సింగరేణి మైనస్ 7, మైనస్ 8, మైనస్ 10, మైనస్ 20 పోతుండే. మైనస్ 10 టు మైనస్ 20 ఎక్కడైనా ఉంటుంది. రేవంత్ వచ్చాక కొత్త విధానం తెచ్చాక అన్ని టెండర్లు ప్లస్ 7 నుంచి ప్లస్ 10 శాతానికి పోతున్నాయి. భట్టి కేవలం నైనీ టెండర్లు మాత్రమే రద్దు చేస్తాం. మరి మిగతా వాటి సంగతి ఏమిటి?’’ అని హరీష్ రావు ప్రశ్నించారు.

Read Also- Minister Seethakka: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?

‘‘ఆన్‌లైన్ టెండర్ల ద్వారా దేశంలో ఎవరైనా వేయొచ్చు, కానీ సైట్ విజిట్ విధానంలో ముందే వెళ్లి సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఈ విధానంలో ఎవరు ముందుగానే టెండర్ వేస్తున్నారో తెలుసుకొని, బెదిరించి, బయపెట్టి వారికి టెండర్ దక్కకుండా చేసి తమ అనుయాయకులకు ప్లస్ 7 నుంచి ప్లస్ 20 శాతానికి కట్టబెట్టి, కమీషన్లు కొల్లగొట్టారు. నైనీ బ్లాక్‌లో ఇదే జరిగింది. వాటాల పంచాయతీ వచ్చి కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ బ్లాక్‌లో లేని విధానం సింగరేణిలో ఎందుకనే దానిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. గతంలో ఇదే సింగరేణిలో బీఆర్ఎస్ సమయంలో ఉన్న టెండర్లు రద్దు చేసి, వాటినే తమ అనుయాయులకు కట్టబెట్టారు. అప్పుడు కాంపిటీటివ్ విధానంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి ఇప్పుడు ప్లస్ 7 మీద టెండర్లు కట్టబెట్టారు. సింగరేణి గతంలో బల్క్‌లో ఐవోసీఎల్ నుంచి సరఫరా చేసేవారు. కానీ పర్సెంటేజీల కోసం డీజిల్‌ను కూడా కాంట్రాక్టర్లకు అప్పగించారు. కమీషన్ల కోసం సింగరేణి ఇచ్చే డీజిల్ విధానం రద్దు చేశారు. చేసిన పని మీదనే కాదు, డీజీల్ కలుపుకొని జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. సంస్థకు నష్టం కదా?. నిజాయితీ ఉంటే, దమ్ముంటే సీబీఐ విచారణకు అనుమతించాలి. అన్ని వివరాలు అందించేందుకు నేను సిద్దంగా ఉన్నాను’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.

Read Also- CM Revanth Reddy: తెలంగాణ మంత్రులకు సీఎం వార్నింగ్.. ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే కుట్ర..?

రేవంత్ రెడ్డి, బీజేపీ అక్రమ సంబంధం లేకుంటే, చీకటి ఒప్పందం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ కిషన్ రెడ్డిని హరీష్ రావు డిమాండ్ చేశారు. రెండేళ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సీఎండీ లేడు.. ఇంచార్జీని పెట్టి ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారు..భట్టి మీరు సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదు అన్ని నైనీ రద్దు చేసారు కదా? అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం..సైట్ విజిట్ విధానం శాశ్వతంగా రద్దు చేయాలని, డీజిల్ విధానం రద్దు చేయాలని, సింగిరేణికి సీనియర్ అర్హత కలిగిన సీఎండీని పెట్టాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్ దండుపాళ్యం ముఠా అన్నారన్నారు. సింగరేణి టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటి రెడ్డి మధ్య వాటాల పంచాయతీ కాదా? మధ్యలో ఐఏఎస్, జర్నలిస్టులు బలి పశువులు అయ్యారన్నారు. ఆరు గ్యారెంటీలు అటకెక్కినయి, వాటాలా పంచాయతీలు ముందుకు వచ్చినయి అని నిలదీశారు. కేసీఆర్ పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను తయారు చేస్తే, కాంగ్రెస్ రాగానే బెదిరింపులు, భూ కబ్జాలు అని ఆరోపించారు. బీఆర్ఎస్ జెండా గద్దె జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది జాగ్రత్త అని సీఎంను హెచ్చరించారు. కూలిస్తే కూలిపోవడానికి బిఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది..తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు.తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ కు వ్యతిరేకం అన్నారు. సైట్ విజిట్ విధానం తప్పు అని నైనీ టెండర్లు రద్దు చేశారని, అదే విధానంలో జరిగిన ఆరు టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని డిమాండ్ చేశారు. అన్ని విషయాలు బయటపెడుతాం అన్న మాటకు కట్టుబడి అన్ని వివరాలు బయట పెట్టాలని భట్టి ని కోరారు. కాంగ్రెస్ బొగ్గు స్కాంపై న్యాయస్థానాలకు సైతం వెళ్లి కొట్లాడుతామని స్పష్టం చేశారు.

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!