Political News: గోదావరిపై వైసీపీ, బీఆర్ఎస్ బురద రాజకీయాలు
వైసీపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు
ఉమ్మడి ఎజెండాతో చంద్రబాబుపై ఆరోపణలు
రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే టీడీపీ అధినేత కోరిక
జగన్ మీడియాను అడ్డంపెట్టుకొని కుట్రలు
హైదరాబాద్‌ను అభివృద్ది చేసిందే చంద్రబాబు
బెంగుళూరు ఫ్యాలెస్ నుంచే జగన్ కుట్ర : ఏపీ ఎంపీ అప్పలనాయుడు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గోదావరి జలాలపై వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు బురద రాజకీయాలు చేస్తున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (Appala Naidu) మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఏపీ సీఎం చంద్రబాబుపై ఆరోపణలు (Political News) చేస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయన్నారు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను వినియోగించుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ బీఆర్ఎస్ నాయకులు.. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందని వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
Read Also- MP Chamal Kiran: దావోస్ ‘వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్’ వేదికపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్, వైసీపీ నాయకులే నీళ్లను తాగుతున్నారని ఎంపీ అప్పల నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జగన్ కోర్టుకు హాజరైతే బీఆర్ఎస్ నేతలు ప్లెక్సీలు పెట్టి స్వాగతం పలికారు. కేటీఆర్ ఖమ్మం వెళ్తే వైసీపీ నేతలు ప్లెక్సీలు కట్టారన్నారు. బీఆర్ఎస్, వైసీపీ స్నేహం ముసుగులో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలు అనుకూల మీడియాలో చంద్ర బాబు నాయుడిపై విషం కక్కుతూ వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు. బెంగుళూరు ఫ్యాలెస్ నుంచే జగన్ కుట్ర చేస్తున్నారని, ఆ ప్యాలెస్‌లో జగన్‌తో బీఆర్ఎస్ నాయకులు భేటీ అవుతూ ఆ కుట్రలో భాగస్వాములవుతున్నారన్నారు. జలవివాదం లేకున్నా వివాదం ఉన్నట్లు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఎజెండా ముసుగులో కుట్ర జరుగుతుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా చంద్ర బాబు నాయుడుకు దేశంలో మంచి పేరు ఉందన్నారు.
Read Also- Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ సరసన నటించే తార లుక్ విడుదల.. ఎంత బావుందో!
విజన్ ఉన్న నాయకుడు చంద్ర బాబు నాయుడు అని ఎంపీ అప్పల నాయుడు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిందే చంద్ర బాబు నాయుడు అని స్పష్టం చేశారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు చేసింది శూన్యమని విమర్శనాస్త్రాలు సంధించారు. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ అయినా రాయలసీమకు తెచ్చారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే నీటి వాటాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం బాగుండాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారన్నారు. 5 యేండ్లలో జగన్ చేయలేని పని రెండేళ్లలో చంద్రబాబు నాయుడు చేసి చూపించారన్నారు. అభివృద్ధి అంటే చంద్ర బాబు నాయుడుఅని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కి గుండు సున్నా రాబోతున్నాయని, కూటమి ఘన విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీకి నూకలు చెల్లే పరిస్థితి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణతో పాటుగా అన్ని చోట్ల ఆదరణ ఉందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో చంద్ర బాబు నాయుడు నిర్ణయం మేరకు పోటీ చెయ్యాలా లేదా నిర్ణయం తీసుకుంటారన్నారు. జగన్, బీఆర్ ఎస్ నాయకులు సొంత వ్యాపారం కోసం కాకుండా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ప్రజల సమస్యలపై చర్చించారా? అని నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాలు మాకు రెండు కళ్ళు అని స్పష్టం చేశారు.

