MP Chamal Kiran:
దావోస్/యాదాద్రి భువనగిరి, స్వేచ్ఛ: డావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొంటున్న బృందంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamal Kiran Kumar Reddy) కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయన దావోస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వనితి (Swaniti) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది మెరిడియన్ కలెక్టివ్ – సబ్‌నేషనల్ కమిట్‌మెంట్ చార్టర్’ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పాలన, స్థిరమైన వృద్ధిపై రాష్ట్రం తీసుకుంటున్న కట్టుబాట్లను అంతర్జాతీయ వేదికపై ఆయన ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, పరిశ్రమల నాయకులతో కలిసి రాష్ట్రాల పాత్ర, ఉప జాతీయ స్థాయిలో విధాన అమలు, ప్రజా ప్రయోజనాలపై చర్చలు జరిగాయి. ఈ సమావేశం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు మరింత బలపడనుందని ఎంపీ విశ్వాసం వ్యక్తం చేశారు. దావోస్ వేదికపై తెలంగాణ ప్రగతి, పెట్టుబడుల అవకాశాలు, భవిష్యత్ అభివృద్ధి దిశలను ప్రపంచానికి పరిచయం చేయడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
Read Also- Crorepati Beggar: రోడ్డుపై భిక్షాటన భిక్షగాడికి 3 ఇళ్లు, 3 ఆటోలు, ఒక కారు.. నివ్వెరపోతున్న జనాలు!

