CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మంత్రులంతా సమన్వయం, సమిష్టితో పనిచేయాలని సూచించారు. సమన్వయం, ఏకాభిప్రాయం లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించినట్లు సమాచారం. పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని మరో పదేళ్ల వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నట్లు సీఎం ప్రత్యేకంగా గుర్తు చేశారు. నేతలంతా ఏకాభిప్రాయంతో వెళ్లాల్సిందేనని నొక్కి చెప్పారు. కొన్ని మీడియాల్లో డిప్యూటీ సీఎం, మంత్రి కోమటిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాల్సిందేనని, లీగల్ గానూ ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను సీఎం మంత్రులకు వివరించినట్లు సమాచారం. కొన్ని శక్తులు ప్రభుత్వాన్ని పనిగట్టుకొని డ్యామేజ్ చేసేందుకు కుట్ర పన్నాయని చర్చ మంత్రుల మధ్య జరిగింది. నేతలంతా కలిసి కట్టుగా ఇలాంటి అంశాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నట్ల పార్టీ లోనూ నిర్ణయం తీసుకున్నారు. టీమ్ వర్క్‌తో ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టాలని పార్టీ నుంచి కూడా క్యాబినెట్ మంత్రులకు ఆదేశాలు వచ్చాయి.
రెండేళ్ల తర్వాత కూడా…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికీ ‘సమన్వయ లోపం’ అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంది. శాఖల మధ్య ఇన్వాల్వింగ్, సబ్జెక్టులతో సంబంధం లేకుండా మంత్రులు ప్రస్తావన.. ఇతర శాఖల ఆఫీసర్లపై ఒత్తిడి వంటివి మంత్రుల మధ్య సమన్వయానికి ప్రధాన కారణంగా మారింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా పార్టీ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
Also Read: CM Revanth Politics: ఎన్టీఆర్, చంద్రబాబు ఫ్యాన్స్‌కు సీఎం రేవంత్ అనూహ్య పిలుపు.. ఇక తిరుగుండదా?
వ్యక్తిగత అజెండాలు పక్కకు…
ప్రభుత్వానికి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వ్యక్తిగత అజెండాల కంటే ప్రభుత్వమే ముఖ్యమని స్పష్టం చేసిన సీఎం.. ప్రభుత్వం ఏర్పాటుకు పడ్డ కష్టాన్ని మంత్రులందరికీ మరోసారి గుర్తు చేసినట్లు తెలిసింది. వ్యక్తిగత ప్రతిష్ట కంటే ప్రభుత్వ ఇమేజ్ కాపాడటమే ప్రాధాన్యతగా పెట్టుకోవాలని సూచించారు. ఇక కీలకమైన ప్రాజెక్టులు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంబంధిత మంత్రులందరూ చర్చించుకుని, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని కోరారు. అంతేగాక పార్టీ అంతర్గత విషయాలను లేదా తోటి మంత్రులపై ఉన్న అసంతృప్తిని మీడియా ముందు కాకుండా, క్యాబినెట్ సమావేశాల్లో లేదా నేరుగా తనతో చర్చించాలని సీఎం స్పష్టం చేశారు. అంతేగాక ప్రజల్లోకి వెళ్లేటప్పుడు ప్రభుత్వం అంతా ఒకే తాటిపై ఉందనే సంకేతం పంపాలని సూచించారు.
Also Read: Medchal News: మేడ్చల్లో 2 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన అధికారులు

