CM Revanth Reddy: ఒక కొత్త రికార్డ్ సృష్టించబోతున్న ముఖ్యమంత్రి
CM Revanth Reddy (imagecredit:twitter)
Telangana News

CM Revanth Reddy: ఒక కొత్త రికార్డ్ సృష్టించబోతున్న ముఖ్యమంత్రి.. సర్టిఫికెట్ అందుకోనున్న సీఎం రేవంత్..?

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. దేశంలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్స్ సర్టిఫికెట్ అందుకోబోతున్న మొదటి ముఖ్యమంత్రిగా ఒక అరుదైన ఘనత సాధించబోతున్నారు. ప్రపంచంలోని నెంబర్ వన్ విద్యాసంస్థల్లో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ‘లీడర్‌షిప్ : 21 సెంచరీ’ అనే కోర్స్‌కు హాజరుకాబోతున్నారు. దీనితో, భారతదేశ చరిత్రలో ఒక ఐవీ లీగ్ కార్యక్రమానికి హాజరవుతున్న మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)నే అవుతారు. ఈ కోర్స్ పేరు ‘21వ శతాబ్దంకోసం నాయకత్వం(అస్తవ్యస్తత, సంఘర్షణ, ధైర్యం)’. ఈ కోర్స్ కోసం ఆయన ఈ నెల 25 నుంచి 30 వరకు మసాచుసెట్స్‌లోని కెనడీ స్కూల్ క్యాంపస్‌లో ఉండి తరగతులకు హాజరవుతారు. ఐదు ఖండాలనుంచి 20 దేశాల ప్రతినిధులు ఈ కోర్సుకు హాజరు కాబోతున్నారు. వీరితో కలిసి రేవంత్ రెడ్డి తరగతులు, అసైన్‌మెంట్‌లు, హోమ్‌వర్క్‌లు పూర్తి చేసి గ్రూప్ ప్రాజెక్టులు కూడా నిర్వహిస్తారు. ఈ కోర్సుకు ప్రొఫెసర్ టిమ్ ఓ బ్రియాన్ ఛైర్మన్‌గా, ప్రొఫెసర్ కరెన్ మోరిసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కోర్సులో భాగంగా ప్రతినిధి బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాల నుండి కేస్ స్టడీలను విశ్లేషించి, పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పిస్తారు. కోర్స్ పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీనుంచి సర్టిఫికెట్ పొందనున్నారు.

హార్వర్డ్ విశ్వవిద్యాలయం విశేషాలు…

ప్రైవేట్ ఐవి లీగ్ పరిశోధనా విశ్వవిద్యాలయం.
మాసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉంది.
1,607లో స్థాపించబడింది (418 సంవత్సరాల చరిత్ర).
గత 100 సంవత్సరాల్లో 75 సార్లు ప్రపంచంలో నెంబర్ 1 విశ్వవిద్యాలయంగా నిలిచింది.
విశ్వవిద్యాలయంలో 14 కళాశాలలు ఉన్నాయి : బిజినెస్ (హెచ్‌బీఎస్), లా(హెచ్ఎల్ఎస్), మెడికల్, గవర్నమెంట్, థియాలజీ శాస్త్రాలకు విడివిడిగా కళాశాలలు.

Also Read: Collector Hanumantha Rao: యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : కలెక్టర్ హనుమంతరావు

కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ విశేషాలు

1936లో స్థాపించబడింది.
1966లో అధ్యక్షుడు కెన్నెడీ పేరు పెట్టబడింది.
గ్రాడ్యుయేట్, మాస్టర్స్, ఎగ్జిక్యూటివ్ కోర్స్‌లు అందిస్తుంది.
2002: 52శాతం పైగా మహిళా విద్యార్థులు.
2011: 75వ వార్షికోత్సవం / విశ్వవిద్యాలయం 375 సంవత్సరాలు.
2014: పూర్వ విద్యార్థులు, దాతల నుండి ½ ట్రిలియన్ డాలర్లు సేకరించింది.
2026: 100 కంటే ఎక్కువ దేశాలకు చెందిన విద్యార్థులతో, హార్వర్డ్‌లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులు చదివే కళాశాలలో ఒకటిగా కెన్నెడీ స్కూల్ నిలిచింది.

Also Read: Lucky Draw Scam: నిన్న బెట్టింగ్ యాప్స్.. నేడు లక్కీ డ్రా.. ఆశపడ్డారో జేబులు గుల్లే!

Just In

01

C-Mitra: సత్ఫలితాలిస్తోన్న ‘సీ-మిత్ర’.. 10 రోజుల్లో 1000 కాల్స్.. 100 ఎఫ్ఐఆర్‌లు నమోదు

Minister Seethakka: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?

Bandla Ganesh: ఇది రాజకీయ యాత్ర కాదు.. దయచేసి విమర్శలు చేయకండి

DGP Office Scandal: డీజీపీ ఆఫీసులో రాసలీలలు.. వైరలవుతున్న వీడియో.. సీఎం సీరియస్!

Crorepati Beggar: రోడ్డుపై భిక్షాటన భిక్షగాడికి 3 ఇళ్లు, 3 ఆటోలు, ఒక కారు.. నివ్వెరపోతున్న జనాలు!