Dhanush and Mrunal: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వార్త పుడుతుందో, అది ఎంతలా వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి వచ్చే వార్తలు నెట్టింట సెన్సేషన్‌ని సృష్టిస్తాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ (Dhanush), సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరి పేర్లు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. వాస్తవానికి వీరిద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. మృణాల్ ఠాకూర్ ఇంకా తమిళ చిత్రసీమలో అడుగుపెట్టనే లేదు. అయినప్పటికీ, గత ఏడాది కాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, వచ్చే నెలలోనే వీరి వివాహం జరగబోతోందని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు నెటిజన్లు ఈ వార్తపై మీమ్స్ జాతర సృష్టిస్తున్నారు.
Also Read- Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్‌ని చూసేందుకు తరలివస్తున్న ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న లేఖలు!
స్పందించిన టీమ్స్.. ఆగని ప్రచారం
ఈ వార్తలపై ధనుష్, మృణాల్ ఠాకూర్ సన్నిహిత వర్గాలు ఇప్పటికే స్పందించి వివరణ ఇచ్చారు. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని, ఇందులో ఏమాత్రం నిజం లేదని వారు కొట్టిపారేశారు. అయితే, నెటిజన్లు మాత్రం అస్సలు ఈ విషయం పట్టించుకోవడం లేదు. తాజాగా ధనుష్, మృణాల్ ఓ ఈవెంట్‌లో కలుసుకుని, మాట్లాడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాను కమ్మేస్తున్నాయి. ఇందులో ధనుష్ కోసం మృణాల్ చాలా ప్రత్యేకంగా స్పందించడం మరింతగా అనుమానాలకు తావిస్తుంది. అందుకే.. సెలబ్రిటీలు మొదట ఇలాగే అంటారు, ఆ తర్వాతే అసలు విషయం బయటపెడతారంటూ తమదైన వాదన వినిపిస్తున్నారు. ఫలితంగా వచ్చే నెలలో పెళ్లి జరగడం ఖాయమని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
Also Read- AR Rahman: ఎవరినీ బాధపెట్టాలని కాదు.. వెనక్కి తగ్గిన రెహమాన్.. వీడియో వైరల్!
వైరల్ అవుతున్న మీమ్స్
ఈ రూమర్స్ నేపథ్యంలో సోషల్ మీడియాలో మీమ్స్ జాతర నడుస్తోంది. ధనుష్ తన అద్భుతమైన నటనతో ఇప్పటికే రెండు జాతీయ అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా హాలీవుడ్ చిత్రాల్లో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే, మీమ్స్ క్రియేటర్స్ మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ‘‘రెండు నేషనల్ అవార్డులు గెలవడం ఇకపై ధనుష్ అన్న కెరీర్‌లో గొప్ప అచీవ్‌మెంట్ కాదు.. మృణాల్‌ను పెళ్లి చేసుకోవడమే అతిపెద్ద అచీవ్‌మెంట్’’ అంటూ ఒక ఫన్నీ మీమ్ విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. మృణాల్ ఠాకూర్ అందం, ఆమె నటనకు ఫిదా అయిన అభిమానులు.. ‘ధనుష్ నిజంగా చాలా అదృష్టవంతుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ (Sita Ramam) చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. కేవలం అందమే కాదు, బలమైన పాత్రలను పోషించడంలో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మరోవైపు, ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కెరీర్‌లో ఎన్నో క్లాసిక్ హిట్స్ ఉన్నాయి. ఈ ఇద్దరు నటులు జంటగా మారతారనే ఊహే అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. మరి ఈ వార్తలకు ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. లేదంటే, నిప్పు లేనిదే పొగ రాదు అంటారు.. వారిద్దరి మధ్య నిజంగానే ఇలాంటిది ఏమైనా నడుస్తుందా? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.
Looks like #Dhanush has mastered black magic just to marry #MrunalThakur 🫠♥️ pic.twitter.com/DcgRfZQBFE
— Swaasthi (@swaasthi) January 18, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

