Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు హాట్ కామెంట్స్
Former Telangana Minister Harish Rao addressing the media on BRS office attacks and Revanth Reddy remarks
Telangana News, లేటెస్ట్ న్యూస్

Harish Rao: బీఆర్ఎస్ దిమ్మెలను కూలగొడితే దిమ్మతిరిగేలా బదులిస్తాం

Harish Rao: ప్రజాక్షేత్రంలో గుణపాఠం నేర్పుతాం

రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు కాంగ్రెస్ యత్నం
హింసను ప్రేరేపించే సీఎం వ్యాఖ్యలపై బీజేపీ చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా బదులిస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో ప్రజల చేతనే గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆదివారం ఎక్స్ వేదికగా ఖండించారు. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ జన్మపర్యంతం ద్వేషించిన కాంగ్రెస్‌ పార్టీలో చేరి, నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. సీఎం పదవి అనుభవిస్తూనే, కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్నరని ఆరోపించారు. ముఖ్యమంత్రి అయ్యుండి, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు సీఎం పని చేస్తున్నారని ఆరోపించారు.

Read Also- CM Revanth Politics: ఎన్టీఆర్, చంద్రబాబు ఫ్యాన్స్‌కు సీఎం రేవంత్ అనూహ్య పిలుపు.. ఇక తిరుగుండదా?

దేశవ్యాప్తంగా బీజేపీ సర్కార్‌‌ను (BJP) కాంగ్రెస్ పార్టీ (Congress Party) వ్యతిరేకిస్తూ ఉంటే.. రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనుక మతలబు ఏంటి? కాంగ్రెస్ శత్రువులైన బీజేపీ,టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహారశైలి ఉంది. పగలు రాహుల్ గాంధీ జపం.. రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ.. అని ఆరోపించారు. రేవంత్ రాజకీయ యాత్ర మొత్తం గురువు చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతోందని అన్నారు.

Read Also- Noida Tragedy: ‘నాకు చనిపోవాలని లేదు.. ప్లీజ్ రక్షించండి నాన్న’.. టెక్కీ ఆఖరి మాటలు!

సోనియా గాంధీ ఇచ్చిన సీఎం పదవిని అనుభవిస్తూ.. కాంగ్రెస్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ కమలం చెంతన, కమలానికి కాపు కాస్తున్న బాబు చెంతన చేరడం అన్యాయమన్నారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని, ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడం అంటే.. అది రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే. ఇది నేరాన్ని ప్రోత్సహించడం కాదా? శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు బాధ్యత ఎటు పోయింది? సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, శాంతి భద్రతలను కాపాడే హోమ్ శాఖను నిర్వహిస్తున్న వ్యక్తి ఇంత బహిరంగంగా నేర చర్యలను, విద్వేషాలను రెచ్చగొడుతుంటే రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు? చట్టం అందరికీ ఒక్కటేనని నిరూపించే ధైర్యం పోలీస్ శాఖకు ఉందా?రాజకీయంగా ఎదుర్కోలేక, భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి సీఎం పిలుపునివ్వడం రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనం. ఇలాంటి చర్యలతో తెలంగాణలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ డీజీపీ .. ఈ హింసను ప్రేరేపించే సీఎం వ్యాఖ్యలపై మీరు తీసుకునే చర్యలేమిటి? రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా లేక రేవంత్ రాజ్యాంగం నడుస్తోందా? అని పడ్డారు.

Just In

01

Vishwambhara: ‘విశ్వంభర’కు లైన్ క్లియర్ అయినట్టేనా? ఆ ఐకానిక్ డేట్‌కేనా రిలీజ్?

Revanth Vs KTR: టీడీపీ పాట పాడడం వెనుక అసలు కుట్ర అర్థమైంది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Jana Nayagan: ‘జన నాయగన్’ పరిస్థితేంటి? పాపం పూజా హెగ్డే?

RTC Officer Death: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ డిపో మేనేజర్ మృతి

Telangana Cabinet Meet: చారిత్రాత్మక రీతిలో హరిత హోటల్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ