Gandhi Talks Teaser: ఒక్క మాట లేదు, అంతా మౌనం!
Characters from the movie Gandhi Talks shown in three contrasting looks, highlighting intense expressions and emotional depth from the film’s narrative.
ఎంటర్‌టైన్‌మెంట్

Gandhi Talks Teaser: ఒక్క మాట లేదు, అంతా మౌనం.. టీజరంతా డబ్బు, మ్యూజిక్కే!

Gandhi Talks Teaser: ప్రస్తుత సినిమా ప్రపంచంలో డైలాగ్స్ అనేవి చాలా కీలకంగా మారిన విషయం తెలిసిందే. భారీ డైలాగులు, చెవులు చిల్లులు పడే సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటేనే సినిమా అని భావించే కాలమిది. కానీ, వీటన్నింటికీ భిన్నంగా, అసలు ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం విజువల్స్, ఎమోషన్స్‌తో కథ చెప్పే సాహసం చేస్తోంది జీ స్టూడియోస్. ఆ సినిమా మరేదో కాదు ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks). ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలై, ప్రేక్షకులను ఒక సరికొత్త ఎమోషనల్ వరల్డ్‌లోకి తీసుకెళుతోంది. ఈ టీజర్‌ను గమనిస్తే.. ఇది కేవలం మాటలు లేని సినిమా మాత్రమే కాదు.. మనసులో నిరంతరం సాగే ఒక సంఘర్షణ అని అర్థమవుతోంది. ‘రా ఎమోషన్స్’ను వెండితెరపై ఆవిష్కరిస్తూ, చూసే ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్ దీనిని తీర్చిదిద్దారు.

Also Read- Ravi Teja BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఇలాంటి సినిమాలు మళ్లీ చేయాలని ఉంది..

ఆస్కార్ విజేత సంగీతమే ప్రాణం

అసలు గాంధీ ఏం చెప్పబోతున్నారు? ఆ నిశ్శబ్దంలో దాగిన సందేశమేంటి? అనే ప్రశ్నలు ఈ టీజర్ చూస్తుంటే తలెత్తకుండా ఉండవు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా, ప్రతి చూపు ఒక డైలాగ్‌లా కనిపిస్తోంది. టీజర్ (Gandhi Talks Teaser) ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అంతా డబ్బు మయం చేశారు. నోటుపై ఉన్న గాంధీ బొమ్మ కూడా ఈ సినిమాలో చాలా కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని మొదటి సీన్‌తోనే చెప్పారు. ఇక డబ్బు కాకుండా ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద బలం ఆస్కార్ ఏఆర్ రెహమాన్ (ARRahman). మాటలు లేని చోట సంగీతమే భాషగా మారుతుందని అంటారు. అలా.. టీజర్‌లో రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని రెట్టింపు చేసింది. ప్రతి నిశ్శబ్దాన్ని, ప్రతి మనోవేదనను రెహమాన్ తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేశారు. సంగీతమే ఈ చిత్రానికి ఆత్మ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read- Sanjay Dutt: ముంబై రోడ్లపై సంజయ్ దత్ ‘టెస్లా సైబర్‌ట్రక్’ హవా.. కిర్రాక్ ఎంట్రీ!

దిగ్గజాల సైలెంట్ యాక్టింగ్

ఈ సినిమాకు దర్శకుడు ఎంపిక చేసుకున్న నటీనటుల ఎంపికే ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. తన కళ్లతోనే కవితలు రాసే విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఈ సైలెంట్ ఫిల్మ్‌లో తన నటనతో మ్యాజిక్ చేయబోతున్నారనే విషయం టీజర్ చూసిన ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇక అరవింద్ స్వామి (Arvind Swami) క్లాసిక్ లుక్‌తో, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో హైలెట్‌గా నిలిచారు. ఇంకా అదితి రావు హైదరి (Aditi Rao Hydari), సిద్ధార్థ్ జాధవ్.. తమ పాత్రల ద్వారా కథకు మరింత లోతును చేకూర్చారు. డైలాగులు లేకుండా కేవలం హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం అనేది ఒక పెద్ద సవాలు వంటిది. కానీ ఇందులోని అందరూ అద్భుతంగా ఆ సవాలును స్వీకరించినట్లుగా టీజర్ తెలియజేస్తుంది. జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం, సంప్రదాయ సినిమాల హద్దులను చెరిపివేస్తోంది. క్యోరియస్ డిజిటల్, పింక్‌మూన్ మెటా స్టూడియోస్, మూవీ మిల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ భారీ ప్రయోగాన్ని నిర్మించాయి. ఇది కేవలం ఒక సినిమా కాదు, థియేటర్లో ప్రేక్షకులు అనుభవించబోయే ఒక అరుదైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. జనవరి 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

AR Rahman: ‘ఛావా’, బాలీవుడ్‌ ఛాన్సెస్‌పై ఏఆర్ రెహమాన్ వివాదస్పద వ్యాఖ్యలు

District Reorganisation: కొత్త పేర్లతో జిల్లాలు?.. బయట వినిపిస్తున్న టాక్ ఇదే!

Peddi Update: బీస్ట్ మోడ్ స్టిల్స్‌తో ఇంటర్నెట్ షేక్! ‘పెద్ది’ తాజా అప్డేట్ ఇదే..

Indigo Airlines: డిసెంబర్‌ గందరగోళం ఎఫెక్ట్.. ఇండిగోకి భారీ జరిమానా విధించిన కేంద్ర ప్రభుత్వం

Ram Charan: తారక్‌తో స్నేహంపై మరోసారి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు