IMDB 2026: 2026 సంవత్సరానికి సంబంధించి ఐఎండిబి మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్‌ని (IMDB Most Anticipated Indian Movies 2026) విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల మిలియన్ల ఐఎండిబి వినియోగదారుల పేజ్ వ్యూస్ ఆధారంగా 2026లో ఎంతగానో వేచి చూస్తున్న భారతీయ సినిమాల లిస్ట్‌తో ఈ మూవీ డేటా బేస్ సంస్థ వార్తలలో నిలుస్తోంది. ప్రపంచములో సినిమాలు, టీవీ షోలు, ఇంకా సెలెబ్రిటీల సమాచారానికి జనాదరణ పొందిన, అధికారిత వనరుగా భావిస్తున్న ఐఎండిబి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్లకు పైగా నెలవారి సందర్శకుల వాస్తవిక పేజ్ వ్యూస్ ఆధారంగా నిర్ణయించబడిన విధంగా 2026లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ లిస్ట్‌ను వదలడంతో.. ఇప్పుడంతా మా అభిమాన హీరో సినిమా పేరు ఇందులో ఉందా? లేదా? అని సెర్చ్ చేస్తున్నారు.
Also Read- Sharwanand: సంక్రాంతికి శర్వా వస్తే.. అన్ని సినిమాలు హిట్టే. వచ్చే సంక్రాంతికి కూడా రెడీ!
2026లో ఐఎండిబి మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇదే..
1. కింగ్ (SRK King)
2. రామాయణ పార్ట్ 1
3. జన నాయగన్
4. స్పిరిట్ (Spirit)
5. టాక్సిక్
6. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్
7. ఆల్ఫా
8. ధురంధర్ 2
9. బార్డర్ 2
10. ఎల్ఐకే: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ
11. ఫౌజి (Fauzi)
12. ది ప్యారడైజ్ (The Paradise)
13. పెద్ది (Peddi)
14. డ్రాగన్ (Dragon)
15. లవ్ అండ్ వార్
16. భూత్ బంగ్లా
17. బెంజ్
18. శక్తి శాలిని
19. పేట్రియాట్
20. ఓ రోమియో
ఆ స్టార్స్‌వి రెండేసి సినిమాలు
ఈ లిస్ట్‌లో ఐదు భాషల సినిమాలకు చోటు లభించింది. ఆ వివరాల్లోకి వెళితే.. 10 హిందీ, ఐదు తెలుగు, మూడు తమిళం, ఒకటి మలయాళం, ఒకటి కన్నడ సినిమాలు ఉన్నాయి. మొదటి స్థానంలో ఉన్న ‘కింగ్’ చిత్రం షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కలయికలో రూపుదిద్దుకుంటోంది. జాబితాలో ఉన్న ఈ సినిమాలలో రెండేసి సినిమాలు ఉన్న నటీనటులు ఎవరంటే.. నయనతార (టాక్సిక్, పేట్రియాట్), యష్ (రామాయణ పార్ట్ 1, టాక్సిక్), సన్నీ డియోల్ (రామాయణ పార్ట్ 1, బార్డర్ 2), ప్రభాస్ (స్పిరిట్, ఫౌజి), రణబీర్ కపూర్ (రామాయణ పార్ట్ 1, లవ్ అండ్ వార్), ఆలియా భట్ (ఆల్ఫా, లవ్ అండ్ వార్), తృప్తి డిమ్రీ (స్పిరిట్, ఓ రోమియో). ఈ జాబితాలో రెండు సీక్వెల్స్ కూడా ఉన్నాయి. అవి ‘ధురంధర్ 2, బార్డర్ 2’. ఇందులో ఆల్ఫా (వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్), బెంజ్ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్), శక్తి శాలిని (మాడ్డ్రాక్ హారర్-కామెడి యూనివర్స్) వంటి సినిమాటిక్ యూనివర్సెస్ కూడా ఉన్నాయి. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. స్పిరిట్, ఫౌజి, ది ప్యారడైజ్, పెద్ది, డ్రాగన్ చోటు దక్కించుకున్నాయి. ఈ సినిమాల విడుదల తేదీలు, ట్రెలర్స్, ఇంకా ఇతర సినిమాల, టీవీ షోల వివరాల కొరకు తెలుసుకోవటానికి ఫ్యాన్స్ 2026 యొక్క ఐఎండిబి మోస్ట్ ఎవైటెడ్ లిస్ట్‌ను చూడవచ్చని ఐఎమ్‌డిబి ప్రకటించింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

