Naveen Polishetty: క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే.. అవుట్ పుట్ ‘రాజు’లా..
Naveen Polishetty AOR (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Naveen Polishetty: క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే.. అవుట్ పుట్ ‘రాజు’లా ఉంటుంది

Naveen Polishetty: సంక్రాంతి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించారు. నవీన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. భారీ అంచనాలతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని.. అసలు సిసలైన పండగ సినిమాలా ఉందని.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల భారీ వసూళ్లతో సంచలనం సృష్టించి, సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతున్న సందర్భంగా మేకర్స్ థ్యాంక్యూ మీట్‌ (Anaganaga Oka Raju Thank You Meet)ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ..

Also Read- Sharwanand: సంక్రాంతికి శర్వా వస్తే.. అన్ని సినిమాలు హిట్టే. వచ్చే సంక్రాంతికి కూడా రెడీ!

వాళ్లిద్దరూ ఎంతో ప్రోత్సహించారు

‘‘మాకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, మాకు మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అనేది బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్. ఎన్నో మైలురాయి లాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. అలాంటి సంస్థ నుంచి ఇటీవల వచ్చిన ఒకట్రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇలాంటి తరుణంలో ‘అనగనగా ఒక రాజు’ రూపంలో ప్రేక్షకులు బ్లాక్ బస్టర్‌ను అందించడం.. మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా మా నిర్మాత నాగవంశీ ముఖంలో చిరునవ్వు చూడటం సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మా గురువు త్రివిక్రమ్, చినబాబు గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. వారిద్దరూ ఈ సినిమా విషయంలో మమ్మల్ని నమ్మి ఎంతగానో ప్రోత్సహించారు. మేము చెప్పింది నమ్మి ఏ ఎపిసోడ్లు అయితే సినిమాలో ఉంచడానికి వారు అంగీకరించారో.. ఇప్పుడా ఎపిసోడ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో మొదటి సన్నివేశం నుంచి ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులు ఆగకుండా నవ్వుతూనే ఉన్నారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే పొలిటికల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. నా సినిమాలలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి ఎమోషన్స్ కూడా అందించాలనుకున్నాం. నాకు రాజ్‌కుమార్ హిరానీ సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాం. శ్రీరాములు వంటి ఒక మాస్ థియేటర్లో ఈ సినిమా చూశాం. ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంతలా ఎంజాయ్ చేశారో, ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు వర్షం కురిపించారు. మా కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైందని మాకు అప్పుడే అనిపించింది.

Also Read- Spirit Release Date: ప్రభాస్, సందీప్ వంగా ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

నమ్మి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే..

హీరోగా నాకిది కేవలం నాలుగో సినిమానే. అలాగే ఇదే నా మొదటి సంక్రాంతి సినిమా. పోటీలో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మా సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల ఏదో శక్తి ఉందని.. నా వెనకున్న శక్తి ప్రేక్షకులే. నా సినిమాలను మోసేది ప్రేక్షకులే. ఒక్క ఛాన్స్ అంటూ తిరిగే నాకు.. వరుసగా నాలుగు విజయాలు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి పేరుపేరునా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు కూడా మిమ్మల్ని అలరించడానికి నా శక్తికి మించి కృషి చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. దర్శకుడిగా మారి సహకారం మరిచిపోలేనిది. రచనలోనూ తనదైన సహకారం అందించాడు. యాక్సిడెంట్ అయ్యి, ఈ కథ రాస్తున్న సమయంలో నేను కాస్త నిరుత్సాహంతో ఉన్నాను. ఆ సమయంలో మా కో-రైటర్ చిన్మయి నాలో ప్రేరణ నింపింది. మీనాక్షి చౌదరి, రావు రమేష్ ఇలా నటీనటులందరూ అద్భుతంగా నటించారు. అద్భుతమైన సంగీతం అందించిన మిక్కీ జే మేయర్‌కు ధన్యవాదాలు. ఒక రైటర్‌ని కానీ, ఆర్టిస్ట్‌ని కానీ, డైరెక్టర్‌ని కానీ నమ్మి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్ పుట్ ఇలా ఉంటుంది. మమ్మల్ని నమ్మి మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన మా నిర్మాత నాగవంశీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. సంక్రాంతికి మంచి సినిమా ఇచ్చారు, సినిమా అద్భుతంగా ఉందని.. ఎందరో సినీ ప్రముఖులు మాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ‘అనగనగా ఒక రాజు’ చూడనివారు వెంటనే టికెట్ బుక్ చేసుకొని చూడండి. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bandla Ganesh: సుద్దపూస.. బండ్ల న్యూ అవతార్ చూశారా? డీజే కొట్టు మామా!

Naga Vamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది..

Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!

IMDB 2026: ఐఎండిబి 2026లో మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇదే..

Huzurabad: హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలో.. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల!