Sharwanand: సంక్రాంతికి శర్వా వస్తే.. అన్ని సినిమాలు హిట్టే!
Sharwanand (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Sharwanand: సంక్రాంతికి శర్వా వస్తే.. అన్ని సినిమాలు హిట్టే. వచ్చే సంక్రాంతికి కూడా రెడీ!

Sharwanand: చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari). రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. జనవరి 14న విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సంక్రాంతి చిత్రాలలో ఒక విన్నర్‌గా నిలిచి హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో మేకర్స్ తమ సంతోషాన్ని తెలిపేందుకు సంక్రాంతి విన్నర్ మీట్ పేరిట ఓ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ (Sharwanand) మాట్లాడుతూ..

అందుకే సంక్రాంతికి వచ్చా..

‘‘అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇది నాకు చాలా చాలా ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే, హిట్ కొడతానని చెప్పాను. చెప్పి కొట్టాను. ఇది గర్వంతోనో, లేదంటే పొగరుతో చెప్పడం లేదు. చాలా హంబుల్‌గా చెప్తున్నాను. హిట్టు కొడతానని అంత నమ్మకంగా ముందే చెప్పడానికి కారణం ఈ కథ మీద ఉన్న నమ్మకం. రామ్, నందు, భాను వాళ్లు రాసిచ్చిన కథ మొదటి రోజు నుంచే నాకు ఎంతో నమ్మకాన్ని కలిగించింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా బ్లాక్ బస్టర్ అవుతుందని మా నిర్మాత అనిల్‌కు ముందే చెప్పాను. సంక్రాంతి అనేది రెవెన్యూ పరంగా 40, 50 శాతం పెరుగుతుంది. నేను కూడా సంక్రాంతికి రావాలనుకున్నాను. దీనికి సక్సెస్ ఫుల్‌గా నెరవేర్చింది మాత్రం మా నిర్మాత అనిలే. రామ్ అబ్బరాజు వంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి కావాలి. తను ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. నాకు కథ ఎలా చెప్పాడో.. అంతకంటే అద్భుతంగా తీశాడు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాను. ఆ హిట్ ఇచ్చిన రామ్‌కి థాంక్యూ. భాను, నందు అద్భుతంగా రాశారు. ఎక్కడ బోర్ కొట్టించకుండా అద్భుతమైన మాటలు రాశారు. యువరాజ్ చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ చేశారు.

Also Read- Chikiri Chikiri Song: ‘పెద్ది’ మేనియా.. మరో ఘనతను సాధించిన ‘చికిరి చికిరి’ సాంగ్!

ఇక వాళ్లే చూసుకోవాలి

అనిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో అందరూ కూడా ఆయన్ని మంచి నిర్మాత అంటారు. ఆయన ఈ రోజు నాకు ఒక బ్రదర్‌లా నిల్చున్నారు. ఈ సినిమాని ఎంత కష్టపడి తీశారో.. ఎంత కష్టపడి రిలీజ్ చేశారో నాకు తెలుసు. మా జర్నీ కొనసాగుతుంది. నిర్మాత దిల్ రాజు సపోర్టు నాకెప్పుడు ఉంటుంది. ఆయన తక్కువ థియేటర్లే అని ముందే చెప్పారు. మాకు తెలిసే రిలీజ్ చేశాం. మంచి సినిమా ఇచ్చాం, మంచి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వారి చేతుల్లో పెట్టాం.. ఇక వాళ్లే చూసుకోవాలి. ఇలాంటి గోల్డెన్ హాండ్స్ ఉన్నప్పుడు.. నేను ఓ ఆలోచించి, టెన్షన్ పడాల్సిందేమీ లేదు. సంయుక్త వండర్‌ఫుల్ కోస్టార్. తను అందరికీ హిట్స్ ఇస్తుంది అని చెప్తుంటారు. నాకు హిట్ ఇచ్చినందుకు థాంక్యూ. సాక్షి వైద్య కూడా చాలా అద్భుతంగా నటించింది. నరేష్ ఈ సినిమాకి మరో హీరో. మా నాన్న క్యారెక్టర్‌లో అద్భుతంగా చేశారు. ఆయన సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే విపరీతంగా నవ్వుకునేవాళ్ళం. అందరు కూడా చాలా రోజుల తర్వాత ఇంతలా నవ్వుకున్నామని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇంకా కష్టపడతాను.. మంచి సినిమాలు చేస్తాను. ఆ దేవుడే నన్ను ముందుకు తీసుకెళ్తాడని నమ్ముతున్నాను. సంక్రాంతికి అన్ని సినిమాలు బాగా ఆడుతున్నాయి. మన బాస్ మెగాస్టార్ సినిమా అద్భుతంగా ఆడుతుంది. అలాగే ‘అనగనగా ఒక రాజు’ నవీన్ పోలిశెట్టి సినిమా, ఇంకా ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నింటికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెబుతున్నాను.

Also Read-Spirit Release Date: ప్రభాస్, సందీప్ వంగా ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

నాకోసం స్లాట్ ఉంచండి

నేను ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా.. కచ్చితంగా అన్ని సినిమాలు ఆడుతాయి. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వచ్చినపుడు కూడా అన్ని సినిమాలు ఆడాయి. ‘శతమానం భవతి’ సమయంలో కూడా పోటీకి వచ్చిన అన్ని సినిమాలు ఆడాయి. ఇప్పుడు కూడా అన్ని సినిమాలు ఆడుతున్నాయి. సో.. శర్వా సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలు బాగుంటాయని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి.. కచ్చితంగా నా కోసం ఒక స్లాట్ పక్కన పెట్టండి. నెక్స్ట్ సంక్రాంతికి మళ్లీ వస్తున్నాను. శ్రీనువైట్ల, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Naga Vamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది..

Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!

IMDB 2026: ఐఎండిబి 2026లో మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇదే..

Huzurabad: హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలో.. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల!

MP Dharmapuri Arvind: కేటీఆర్ మాది గాలివాటమా? మీ చెల్లిని అడుగు.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు!