Chikiri Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడే వేరు. అలాంటిది ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో, మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతంలో ఒక స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతుంటే ఇంక ఆ సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వీరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు, ఏ రేంజ్‌లో ఉన్నాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri Song) ఒక్కటి చాలు.. ఈ సినిమా రేంజ్ ఏంటో చెప్పడానికి అన్నట్లుగా ఆ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇప్పుడీ సాంగ్ మరో రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అదేంటంటే..
Also Read- Spirit Release Date: ప్రభాస్, సందీప్ వంగా ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ ఫిక్స్..
రికార్డుల వేటలో ‘చికిరి చికిరి’
ఈ సాంగ్ కేవలం ఒక సినిమా పాటగా మిగిలిపోకుండా, ఒక గ్లోబల్ మ్యూజిక్ సెన్సేషన్‌గా మారింది. ఐదు భాషల్లో కలిపి ఈ పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డులను తిరగరాస్తోంది. యూట్యూబ్‌లో 2 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి చరణ్ క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. అలాగే ప్రముఖ మ్యూజిక్ యాప్స్‌లో 60 మిలియన్లకు పైగా ఆడియో స్ట్రీమ్స్‌ను రాబట్టి ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్‌లో టాప్ ప్లేస్ సంపాదించింది. ఈ పాట ఏ రేంజ్‌లో జనాల్లోకి వెళ్లిందంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 3 లక్షల కంటే ఎక్కువ రీల్స్ వచ్చాయి. యూట్యూబ్ షార్ట్స్‌లో 8.7 లక్షల మంది ఈ సాంగ్‌ను ఉపయోగిస్తూ వీడియోలు చేశారు. చిన్న పిల్లల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఆ ఐకానిక్ స్టెప్‌ను రిక్రియేట్ చేస్తూ గ్లోబల్ మూమెంట్‌గా మార్చేశారు. ఇది ‘చికిరి చికిరి’ ప్రభంజనం.
Also Read- Tiger Of Martial Arts: పవన్ కళ్యాణ్, విద్యుత్ జమ్వాల్ మధ్య ఆసక్తికర సంభాషణ!
రెహమాన్ మార్క్ బీట్ – చరణ్ గ్రేస్
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ పాట కోసం ఒక అద్భుతమైన ఎనర్జీ ఉన్న ట్యూన్‌ను కంపోజ్ చేశారు. ఈ పాట వినగానే చిందులు వేసేలా ఉండే బీట్స్, దానికి తోడు ఒక ఫెస్టివల్ వైబ్ కలగడం ఈ పాట సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక రామ్ చరణ్ గురించి చెప్పేదేముంది.. ఆయన అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్, హుక్ స్టెప్స్‌తో దుమ్మురేపారు. అంతే పాట వైరల్ తుఫానులా మారిపోయింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘పెద్ది’ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట ఇచ్చిన ఎనర్జీతో రామ్ చరణ్ మరో గ్లోబల్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ కలలు కంటున్నారు.
It is double the celebration this festival as #ChikiriChikiri reaches another humongous milestone ❤🔥
200 MILLION+ VIEWS and counting for the chartbuster #ChikiriChikiri with 2M+ LIKES, 870K+ SHORTS on YouTube, 300K+ REELS on Instagram and 60M+ streams on music platforms ✨💥… pic.twitter.com/P5nqVrViBA
— PEDDI (@PeddiMovieOffl) January 16, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

