Euphoria Movie: గుణ శేఖర్ ‘యుఫోరియా’ ట్రైలర్ డేట్ ఫిక్స్..
Euphoria-Teaser(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Euphoria Movie: గుణ శేఖర్ ‘యుఫోరియా’ ట్రైలర్ డేట్ ఫిక్స్..వచ్చేది ఎప్పుడంటే?

Euphoria Movie: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారీ సెట్టింగ్‌లు, పీరియడ్ డ్రామాలకు పెట్టింది పేరు దర్శకుడు గుణశేఖర్. ‘చూడాలని ఉంది’, ‘ఒక్కడు’, ‘రుద్రమదేవి’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయన, ఈసారి తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. ప్రస్తుతం సమాజంలోని బర్నింగ్ ఇష్యూస్‌ను టచ్ చేస్తూ ఆయన తెరకెక్కించిన న్యూ-ఏజ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘యుఫోరియా’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 17న నిర్వహించనున్నారు నిర్మాతలు.

Read also-Kattalan: ‘కటాలన్’ సెకండ్ లుక్ వచ్చేసింది.. ఊర మాస్ అవతార్‌!

‘యుఫోరియా’ సినిమా కేవలం వినోదం కోసమే కాకుండా, నేటి తరం యువత బాట తప్పుతున్న తీరును ఎండగట్టేలా రూపొందించబడింది. నగరాల్లో పెరుగుతున్న డ్రగ్స్ సంస్కృతి, రాత్రిపూట జరిగే రేవ్ పార్టీలు మరియు సోషల్ మీడియా ప్రభావం వల్ల తలెత్తే అనర్థాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారు. ఒకప్పుడు చారిత్రక అంశాలతో సినిమాలు తీసిన గుణశేఖర్, ఇప్పుడు తన కూతురు నీలిమ గుణ నిర్మాణంలో ఇంతటి సమకాలీన అంశాన్ని ఎంచుకోవడం విశేషం. ఈ సినిమాలో సీనియర్ నటి భూమికా చావ్లా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజర్ విడుదలైనప్పటి నుండి భూమిక పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న చిత్రం ఇది కావడంతో ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సారా అర్జున్ విఘ్నేష్ గవిరెడ్డి వంటి యువ నటీనటులు ఈ డ్రగ్ మాఫియా కథలో కీలక పాత్రలు పోషించారు.

Read also-Marriage Rumours: వాలెంటైన్స్ డే రోజున ధనుష్, మృణాల్ పెళ్లి? వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్!

ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ప్రవీణ్ కె. పోతన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఒక డార్క్, ఇంటెన్స్ లుక్ ఇచ్చింది. ట్రైలర్‌లో విజువల్స్ చాలా గ్రిప్పింగ్‌గా ఉండబోతున్నాయని ప్రచార చిత్రలను చూస్తే అర్థం అవుతుంది. గుణశేఖర్ తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి తీసిన ఈ సినిమా, యువతకు ఒక హెచ్చరికలా ఉండబోతోంది. జనవరి 17న విడుదలయ్యే ట్రైలర్ సినిమా కథపై మరింత స్పష్టత ఇవ్వనుంది. ఫిబ్రవరి 6న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో గుణశేఖర్ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాలి.

Just In

01

BJP Group Politics: బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్.. ఆ తరహా రాజకీయాలుంటే తప్పేంటి.. బీజేపీ ఎంపీల భిన్న స్వరాలు!

Naveen Polishetty: క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే.. అవుట్ పుట్ ‘రాజు’లా ఉంటుంది

CM Revanth Reddy: ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ, ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తాం.. నిర్మల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు!

Sharwanand: సంక్రాంతికి శర్వా వస్తే.. అన్ని సినిమాలు హిట్టే. వచ్చే సంక్రాంతికి కూడా రెడీ!

Chikiri Chikiri Song: ‘పెద్ది’ మేనియా.. మరో ఘనతను సాధించిన ‘చికిరి చికిరి’ సాంగ్!