Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రభాకర్ రావు(Prabhakar Rao) ఇంటరాగేషన్ తోందరగా పూర్తి చేయండని తెలిపింది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో ఇంకా ఏం మిగిలింది. ఇప్పటికే అతడిని రెండు వారాలకు కస్టడీకి అనుమతించామని పేర్కోంది. గత కొంతకాలంగా మే నుంచి ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించామని పేర్కోంది. మీ పర్పస్ పూర్తయిందా లేదా కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని, ఆర్టికల్ 142 కింద మేము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని కోర్టు తెలిపింది.
Also Read: CM Revanth Reddy: ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయి: సీఎం రేవంత్ రెడ్డి
తదుపరి విచారణ
ప్రభాకర్ రావును మళ్లీ జైలులో పెట్టాలనుకుంటున్నారా అని కోర్టు గాటుగా స్సందించింది. అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన.. ఆయనను పిలవకుండా ఉండలేరు. మళ్లీ పిలిచి విచారణ చేయొచ్చు అని పేర్కొంది. ఆయన మీ దర్యాప్తుకు సహకరిస్తారని, తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షణ పొడిగింపు చేస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కోంది. తదుపరి విచారణ మార్చి 10కి కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు ప్రభాకర్ రావు మీకు సహకరిస్తారని కోర్టు తెలిపింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అయిన సిద్ధార్థ లూత్ర(Siddharth Luthra) వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా లేదా అనేది ప్రశ్న? కస్టడీలో పెట్టిన వ్యక్తికి ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారా? అని ఆయన తన వాదనను సుప్రీం కోర్టుకు విన్నవించుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ ఇంకెంతకాలం కొనసాగిస్తారు త్వరగా పూర్తి చేయండి
ఇప్పటికే రెండు వారాలకు కస్టడీకి అనుమతించాం
మే నుంచి ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాము
కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని , ఆర్టికల్ 142 కింద మధ్యంతర… pic.twitter.com/e2P8HzTNxe
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2026
Also Read: Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!

