Slumdog Movie: పూరీ, సేతుపతి సినిమా టైటిల్ వచ్చేసింది..
Slumdog-Movie
ఎంటర్‌టైన్‌మెంట్

Slumdog Movie: పూరీ, సేతుపతి సినిమా టైటిల్ వచ్చేసింది.. ఏం ఉంది మామా..

Slumdog Movie: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలయికలో ఒక భారీ పాన్ ఇండియా సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ‘SLUMDOG – 33 Temple Road’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. “స్లమ్స్ నుండి ఎవరూ ఆపలేని ఒక తుఫాను పుడుతుంది” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్, సినిమా అత్యంత రా (Raw), రూత్‌లెస్ (Ruthless) మాస్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని స్పష్టం చేస్తోంది. పూరి జగన్నాథ్ మార్క్ హీరో యాటిట్యూడ్, విజయ్ సేతుపతి సహజ నటన తోడైతే వెండితెరపై సంచలనం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read also-Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..

ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్ పనిచేస్తున్నారు. స్లమ్ ఏరియా నేపథ్యంలో సాగే ఒక సామాన్యుడి పోరాటమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తమని టైటిల్ మరియు సబ్ టైటిల్ (33 టెంపుల్ రోడ్) సూచిస్తున్నాయి. పూరి సినిమాల్లో ఉండే కరుకుదనం, పదునైన సంభాషణలు విజయ్ సేతుపతి పాత్రకు కొత్త ఎనర్జీని ఇస్తాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read also-Nabha Natesh: అతిలోక సుందరిలా నభా.. ‘నాగబంధం’ ఫస్ట్ లుక్ చూశారా?

పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. విజయ్ సేతుపతికి ప్రస్తుతం ఉన్న నేషనల్ వైడ్ క్రేజ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు పూరీ అభిమానులు. గత కొంత కాలంగా హిట్స్ కోసం ఎదురు చూస్తున్న పూరీ జగన్నాథ్ కి ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Anaganaga Oka Raju: పండక్కి రాజు గారి హవా మామూలుగా లేదుగా.. రెండ్రోజుల గ్రాస్ ఎంతంటే?

Medaram Jatara 2026: మేడారంకు పోటెత్తిన భక్తులు.. ఓరి నాయనా ట్రాఫిక్‌తో కల్లుచెదిరేలా నిలిచిపోయిన వాహనాలు

Crime News: సంక్రాంతి పండుగ ఎఫెక్ట్.. 12 ఇళ్లలో పంజా విసిరిన దొంగల ముఠా..?

Marriage Rumours: వాలెంటైన్స్ డే రోజున ధనుష్, మృణాల్ పెళ్లి? వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్!

MSG Boxoffice: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటేశారు..