Sai Durgha Tej SYG: సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarala Yeti Gattu) (SYG)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు రోహిత్ కేపీ (Rohith KP) ఒక సరికొత్త డిస్టోపియన్ ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తుండగా, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ బ్లాక్‌బస్టర్ వైబ్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, ఇందులో ఉన్న కంటెంట్ అలాంటిది మరి. ఇప్పటి వరకు సాయి దుర్గా తేజ్ కనిపించని న్యూ అవతార్‌లో ఇందులో కనిపిస్తున్నారు.
Also Read- Seetha Payanam: సంక్రాంతి స్పెషల్‌గా ‘సీతా పయనం’ నుంచి బసవన్న వచ్చేశాడు..
సంక్రాంతి స్పెషల్ లుక్..
ఇక సంక్రాంతిని పురస్కరించుకుని తాజాగా మేకర్స్ బాలి అంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పిక్‌లో సాయి దుర్గా తేజ్ లుక్ చూస్తుంటే రా అండ్ రస్టిక్ వైబ్ కనిపిస్తోంది. పెరిగిన గడ్డం, చెదిరిన జుట్టుతో ఉన్న ఆయన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆశ్చర్యపరుస్తోంది. ఒక ఎద్దును పట్టుకుని, మొరటుగా కనిపిస్తున్న ఆయన లుక్.. సినిమాలో ఆయన పాత్ర ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో తెలియజేస్తుంది. అలాగే సంక్రాంతి పండగ వాతావరణానికి తగ్గట్లుగా ఒక వైపు పల్లెటూరి సెటప్ కనిపిస్తున్నా, మరోవైపు ఆ కళ్లలో ఉన్న తీక్షణత సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ లుక్‌తో మరోసారి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
Also Read- Vijay Deverakonda: అమ్మకు ప్రామిస్ చేశా.. నెక్ట్స్ సంక్రాంతికి పక్కాగా..!
2026లోనే రిలీజ్..
ఈ చిత్రం కేవలం యాక్షన్ మాత్రమే కాదు, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన విజువల్ వండర్ అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమనం’ గ్లింప్స్ సినిమా స్థాయిని చెప్పకనే చెప్పింది. అజనీష్ లోకనాథ్ అందిస్తున్న పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా హైలెట్స్‌లో ఒకటిగా నిలవనుంది. సాయి దుర్గా తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026లో భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మాస్ పోస్టర్‌తో సాయి దుర్గా తేజ్ ఫ్యాన్స్‌కు అసలైన ట్రీట్ ఇచ్చారు. ‘విరూపాక్ష’ తర్వాత తేజ్ నుంచి వస్తున్న ఈ ‘సంబరాల ఏటి గట్టు’తో తెలుగు సినిమా సత్తా మరోసారి పాన్ ఇండియా స్థాయిలో చాటడం ఖాయంగా కనిపిస్తోంది.
Where there is land, there is life.
Where there is tradition, there is strength. ❤️🔥‘BALI’ from #SambaralaYetiGattu walks with the pride of the soil and wishes you all a very #HappySankranthi 🌾#SYGMovie IN THEATRES 2026 💥
Mega Supreme Hero @IamSaiDharamTej@rohithkp_dir pic.twitter.com/6R9iTWutml
— Primeshow Entertainment (@Primeshowtweets) January 15, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

