Shambala OTT Release: ఆది సాయికుమార్ నటించిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ ‘శంబాల’ ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు ఒక రోజు ముందుగానే ఎర్లీ యాక్సెస్ తో ఈ సినిమాను చూడొచ్చు. ఆది సాయికుమార్ కెరీర్ లోనే మంచి హిట్ గా నిలిచిన శంబాల ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది. తెలుగులో అసాధారణ విజయం సాధించిన ఈ సినిమా హిందీలో కూడా డబ్బింగ్ అయింది. ప్రస్తుతం హిందీ ప్రేక్షకులు కూడా సినిమా ను అమితంగా ఆదరిస్తున్నారు.
Read also-Naari Naari Naduma Murari Review: శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’.. ఫుల్ రివ్యూ
గతేడాది డిసెంబర్ 25న ‘శంబాల’ సినిమా మిస్టికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని రూపొందించారు. అర్చన ఐయ్యర్ హీరోయిన్ గా నటించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై ఈ మూవీని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్స్ లో మంచి వసూళ్లు సాధించిన శంబాల సినిమాను ఆహా ఓటీటీలో ప్రీమియర్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.
Step into a mystical world where myths come alive and destiny roars.#AadiShambhala Premieres 22nd Jan only on #aha
(24hrs early access for aha gold users)@iamaadisaikumar @tweets_archana #RajasekharAnnabhimoju #MahidharReddy @ugandharmuni pic.twitter.com/bHke5Hmu5b— ahavideoin (@ahavideoIN) January 15, 2026

