Short Film Contest: తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభావంతులైన యువకులు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. కేవలం యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి వేదికలు ఉంటే సరిపోదని, ఒక ప్రాపర్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉండాలని నమ్ముతారు మంచు విష్ణు. అందుకే, తన తండ్రి మోహన్ బాబు గారి పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర పరిశ్రమకు సరికొత్త రక్తాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో “AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ (సీజన్ 1)” ను ఆయన అనౌన్స్ చేశారు.
Read also-Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’ మొదటి రోజు ఎంత వసూలు చేశాడంటే?.. రికార్డ్ బ్రేక్..
స్ఫూర్తి..
ఈ పోటీ వెనుక ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. సుమారు 50 సంవత్సరాల క్రితం, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మోహన్ బాబు గారిలోని ప్రతిభను గుర్తించి, ఆయనకు మొదటి అవకాశం ఇచ్చింది దర్శక రత్న దాసరి నారాయణరావు గారు. ఆ ఒక్క అవకాశం ఆయన జీవితాన్నే మార్చేసింది. అదే తరహాలో, నేటి తరం యువతకు కూడా ఒక పెద్ద స్థాయి వేదికను కల్పించాలనే సంకల్పంతో ఈ పోటీని నిర్వహిస్తున్నట్లు విష్ణు పేర్కొన్నారు.
పోటీలో పాల్గొనడం ఎలా?
మీలో దర్శకుడు కావాలనే కసి, విభిన్నమైన కథలను తెరకెక్కించే నేర్పు ఉంటే ఈ పోటీ మీకు ఒక సువర్ణావకాశం. మీరు స్వయంగా రూపొందించిన ఒక 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింను వారికి పంపాల్సి ఉంటుంది. ఇది కేవలం మీ షార్ట్ ఫిలింను చూసి మెచ్చుకునే పోటీ మాత్రమే కాదు, మీలోని దర్శకత్వ ప్రతిభను లోతుగా పరీక్షించే ఒక ప్రక్రియ.
Read also-Polaki Vijay: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సక్సెస్ వేళ.. విజయ్ పొలాకి మరోసారి ఎమోషనల్ పోస్ట్!
అవకాశం
సాధారణంగా షార్ట్ ఫిలిం పోటీల్లో నగదు బహుమతులు లేదా షీల్డ్స్ ఇస్తుంటారు. కానీ ఈ కాంటెస్ట్ అంతుకు మించి ఉంటుంది. ఇందులో విజేతగా నిలిచిన వ్యక్తికి ఏకంగా 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఒక ఫీచర్ ఫిలింను డైరెక్ట్ చేసే ఛాన్స్ లభిస్తుంది. షార్ట్ ఫిలిం స్టేజ్ నుండి నేరుగా రూ.10 కోట్ల సినిమాకు దర్శకుడిగా మారడం అనేది ఏ యువ దర్శకుడికైనా ఒక గొప్ప కల. దీంతో టాలెంటెడ్ దర్శకులకు ఇది ఇక సదవకాశం. ఈ కాంటెస్ట్ కు సంబంధించిన ‘సీజన్ 1’ విజేత పేరును మార్చి 19న మంచు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా అధికారికంగా ప్రకటిస్తారు. “AVAA ఎంటర్టైన్మెంట్” ద్వారా విష్ణు మంచు చేపట్టిన ఈ ప్రయత్నం సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఎంతోమంది ఔత్సాహికులకు ఒక చక్కని మార్గం కానుంది. మీకు కథలు చెప్పే నైపుణ్యం ఉంటే, మీ ప్రతిభను నిరూపించుకుని 10 కోట్ల ప్రాజెక్టుకు బాస్ అయ్యే అవకాశం మీ ముందే ఉంది.

