Municipal Elections: మున్సిపాలిటీలకు రిజర్వేషన్ల ఖరారు
Municipal Elections ( image creidit: swetcha reporter)
Telangana News

Municipal Elections: మున్సిపాలిటీలకు రిజర్వేషన్ల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

Municipal Elections: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే 10 మున్సిపల్ కార్పొరేషన్‌లకు, 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీదేవి  జీవో ఎంఎస్ నెంబర్ 9 జారీ చేశారు. రాష్ట్రంలో కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, గ్రేటర్ హైదరాబాద్, రామగుండం, మంచిర్యాల, నల్లగొండ, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ పది కార్పొరేషన్ల 840 వార్డులు ఉన్నాయి. ఇందులో మెజార్టీ వార్డులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 300 ఉన్నాయి. అయితే, ఇందులో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీలకు 27 వార్డులు, ఎస్సీలకు 97 వార్డులు, బీసీ జనగణన ప్రకారం బీసీలకు 296 వార్డులను కేటాయించారు. మహిళా జనరల్‌కు 220 వార్డులు, అన్ రిజర్వుడ్ (జనరల్) వార్డులు200 ఉన్నాయి.

Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయా?.. ఉత్కంఠగా మారుతున్న బల్దియా ఎన్నికలు

మున్సిపాలిటీలోని మొత్తం3518 వార్డులు

రాష్ట్రంలో మొత్తం121 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీల పరిధిలో 2,678 వార్డులు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్టీ-175, ఎస్సీ- 400, బీసీలకు డెడికేషన్ కమిషన్ ఆధారంగా బీసీ -736, జనరల్ మహిళ 787, అన్ రిజర్వుడ్ ( జనరల్)-579 వార్డులు ఉన్నాయి. పది కార్పొరేషన్ మేయర్లుగా ఎస్సీ -1, ఎస్టీ -1, బీసీ -3, జనరల్ మహిళ-4, జనరల్-1 రిజర్వేషన్ కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా 121 మున్సిపాలిటీలలో.. ఛైర్ పర్సన్ రిజర్వేషన్లను సైతం ప్రకటించారు. ఎస్టీ -5, ఎస్సీ 17, బీసీ -38, జనరల్ ఉమెన్ -31, జనరల్-30గా ప్రకటించారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలోని మొత్తం3518 వార్డులు ఉండగా, అందులో మహిళలకు1007 వార్డులను కేటాయించారు. బీసీలకు1032 వార్డులను కేటాయిస్తూ ఉత్తర్వులు చేశారు.

Also Read: Municipal Elections: ఆ తేది కల్లా ఓటరు తుది జాబితా సిద్ధం చేయాలి.. అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్!

Just In

01

Rahul IAS: తన వెడ్డింగ్ కార్డ్ నే కాదు.. ఇప్పుడు కొడుకు పేరున రిలీజైన త్రీడీ వీడియో రివ్యూ నెట్టింట వైరల్.. ఎవరా ఐఏఎస్ ఆఫీసర్?

Naari Naari Naduma Murari Review: శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’.. ఫుల్ రివ్యూ

Black Jaggery: ఆ జిల్లాలో జోరుగా నల్లబెల్లం దందా.. 100 క్వింటాళ్లు దొరికిన వారిపై పోలీసుల చర్యలు ఏవి?

Gadwal District: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. పట్టుకుని వదిలేసిన పీడిఎస్ బియ్యం వాహనం ఎవరిది?

Khammam Municipal Elections: ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధం.. 10 ఏళ్ల ప్రత్యేక అధికారి పాలనకు ముగింపు?